online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఆగష్టు-2015

1) ఫాధర్ ఆఫ్ ఇంగ్లీషు పొయిట్రీ అని ఎవరిని పిలుస్తారు
a. విలియం షేక్స్పియర్
b. జాన్ మిల్టన్
c. జెఫ్రే చౌసెర్
d. చార్లెస్ డికెన్స్
సరైన సమాధానం : జెఫ్రే చౌసెర్
2) టీచర్స్ డే ఏ రోజున జరుపుకుంటారు ?
a. 5 సెప్టెంబర్
b. 5 అక్టోబర్
c. 5 నవంబర్
d. 5 డిసెంబర్
సరైన సమాధానం : 5 సెప్టెంబర్
3) భారతదేశం యొక్క ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు ?
a. జవహర్ లాల్ నెహ్రూ
b. మహాత్మా గాంధీ
c. సర్దార్ పటేల్
d. సుభాష్ చంద్ర బోస్
సరైన సమాధానం : సర్దార్ పటేల్
4) ఈ క్రింది సంఖ్యలలో ఏది 3, 6 మరియు 9 చే భాగింపబడుతుంది ?
a. 45
b. 54
c. 63
d. 81
సరైన సమాధానం : 54
5) మిల్కా సింగ్ అనే క్రీడాకారుడు ఈ కింది క్రీడలలో దేనికి సంబందించిన వాడు ?
a. అథ్లెటిక్స్
b. బాక్సింగు
c. క్రికెట్
d. హాకీ
సరైన సమాధానం : అథ్లెటిక్స్
6) "మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను "? అని ఎవరు చెప్పారు
a. సుభాష్ చంద్ర బోస్
b. మహాత్మా గాంధీ
c. జవహర్ లాల్ నెహ్రూ
d. సర్దార్ పటేల్
సరైన సమాధానం : సుభాష్ చంద్ర బోస్
7) 305 x 95 ను హెచ్చిస్తే వచ్చే సమీప నెంబరు ఏది
a. 3000
b. 30000
c. 27000
d. 300
సరైన సమాధానం : 30000
8) ఈ క్రింది జంతువులలో ఏ జంతువు మనకు ఉన్ని ఇస్తుంది
a. ఆవు
b. గొర్రె
c. గుఱ్ఱం
d. మేక
సరైన సమాధానం : గొర్రె
9) ఆగ్రాలో తాజ్ మహల్ ను ఎవరు నిర్మించారు
a. అక్బర్
b. షాజహన్
c. జహంగీర్
d. బాబర్
సరైన సమాధానం : షాజహన్
10) ఈ క్రింది పదాలలో ఏది పదం యొక్క స్పెల్లింగు కరెక్టుగా ఉంది
a. Februery
b. Septamber
c. January
d. Decamber
సరైన సమాధానం : January
11) మన ఇళ్ళను ఎవరు నిర్మిస్తారు
a. వాచ్ మెన్
b. తోటమాలి
c. పోస్టుమేన్
d. మేస్త్రి
సరైన సమాధానం : మేస్త్రి
12) ఈ కింది వాటిలో ఏది సరి సంఖ్య కాదు?
a. 2
b. 30
c. 35
d. 50
సరైన సమాధానం : 35
13) పంజాబ్ కేసరి అని ఎవరిని పిలిచేవారు ?
a. భగత్ సింగ్
b. లాలా లజపతి రాయ్
c. సర్దార్ పటేల్
d. చంద్ర శేఖర్ అజాద్
సరైన సమాధానం : లాలా లజపతి రాయ్
14) నా వయసు 8 సంవత్సరాలు మరియు నేను నా తండ్రి కంటే 30 సంవత్సరాల చిన్నవాడైని, ఐతే నా తండ్రి వయస్సు ఎంత ?
a. 38
b. 28
c. 48
d. 8
సరైన సమాధానం : 38
15) చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
a. నీల్ ఆర్మ్స్ట్రాంగ్
b. యూరీ గగారిన్
c. ఎడ్మండ్ హిల్లరీ
d. డెనిస్ టిటో
సరైన సమాధానం : నీల్ ఆర్మ్స్ట్రాంగ్
16) సాధారణంగా నీటి యొక్క మరిగే పాయింట్ ఎంత?
a. 90 డిగ్రీలు
b. 100 డిగ్రీలు
c. 80 డిగ్రీలు
d. 110 డిగ్రీలు
సరైన సమాధానం : 100 డిగ్రీలు
17) ఏ రంగులో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ మనల్ని ఆగమని సూచిస్తుంది
a. ఆకుపచ్చ
b. పసుపు
c. ఎరుపు
d. నీలం
సరైన సమాధానం : ఎరుపు
18) Long అనే ఇంగ్లీషు పదానికి వ్యతిరేక పదం?
a. Small
b. Near
c. Tall
d. Short
సరైన సమాధానం : Short
19) సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు
a. ఉత్తరం
b. దక్షిణం
c. పడమర
d. తూర్పు
సరైన సమాధానం : తూర్పు
20) Boundary అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు
a. పుట్ బాల్
b. హాకీ
c. క్రికెట్
d. రగ్బీ
సరైన సమాధానం : క్రికెట్
21) స్కర్వీ అనే వ్యాధి ఏ వైటమిన్ లోపంవల్ల కలుగుతుంది ?
a. విటమిన్ A
b. విటమిన్ B
c. విటమిన్ C
d. విటమిన్ D
సరైన సమాధానం : విటమిన్ C
22) ఇండియన్ ఆర్మీ డే ను ఏ రోజున జరుపుకుంటారు
a. 15 జనవరి
b. 15 పిబ్రవరి
c. 15 మార్చి
d. 15ఏప్రియల్
సరైన సమాధానం : 15 జనవరి
23) షోలే హింది చిత్రంలో గబ్బర్ సింగ్ పాత్ర ను ఎవరు పోషించారు?
a. Amitabh Bachchan
b. Amjad Khan
c. Dharmendra
d. Sanjeev Kumar
సరైన సమాధానం : Amjad Khan
24) ఆడ గుఱ్ఱాన్ని ఇంగ్లీషు బాషలో ఏమని పిలుస్తారు
a. Cow
b. Goose
c. Jenny
d. Mare
సరైన సమాధానం : Mare
25) డోనాల్డ్ డక్ మరియు మిక్కీ మౌస్ ను ఎవరు రూపకల్పన చేశారు?
a. Walt Disney
b. Arthur Canon Doyle
c. Bob Kane
d. Rudyard Kipling
సరైన సమాధానం : Walt Disney
26) ఏ బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాతలని అంటారు
a. A
b. B
c. O
d. AB
సరైన సమాధానం : O
27) ఒక మనిషి రూ 100 లకు 20 మామిడి పండ్లలను అమ్మితే , అప్పుడు ఒక మామిడి పండు ఖర్చు ఎంత?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 5
28) ఎక్కడ హిందూ మతం ఆరాధన చేస్తారు ?
a. మసీదు
b. గరుద్వార
c. చర్చి
d. గుడి
సరైన సమాధానం : గుడి
29) ఈ కింది వాటిలో ఏది ఓవల్ ఆకారంలో ఉంది ?
a. సూర్యుడు
b. కోడిగుడ్డు
c. చంద్రుడు
d. పుట్ బాల్
సరైన సమాధానం : కోడిగుడ్డు
30) గుజరాత్ ముఖ్యనగరం ఏది (క్యాపిటల్)
a. గాందీనగర్
b. అహ్మదాబాద్
c. జైపూర్
d. ఉదయ్ పూర్
సరైన సమాధానం : గాందీనగర్
31) శరీరంలో ఏ భాగాన్ని కేటరాక్ట్ వ్యాధి ప్రభావితం చేస్తుంది
a. చెవి
b. కన్ను
c. ముక్కు
d. గొంతు
సరైన సమాధానం : కన్ను
32) మనం శ్వాసలోనికి ఆక్సజన్ ను తీసుకుని దేనిని బయటకు వదులుతాము
a. ఆక్సిజన్
b. కార్బన్ మోనాక్సైడ్
c. కార్బన్ డైయాక్సైడ్
d. నైట్రోజన్
సరైన సమాధానం : కార్బన్ డైయాక్సైడ్
33) 782 ను 5 చేత బాగిస్తే వచ్చే భాగహారం మరియు శేషం ఎంత?
a. 156 and 2
b. 155 and 1
c. 156 and 3
d. 155 and 2
సరైన సమాధానం : 156 and 2
34) కంప్యూటర్ ప్రోగ్రాంలో మనం ఈ కింది ఏ సాప్టువేరులో మనం చిత్రాలు సృష్టించవచ్చు
a. MS-Word
b. MS-Excel
c. Paint
d. Notepad
సరైన సమాధానం : Paint
35) ఒక బాస్కెట్ బాల్ జట్టు లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారు ?
a. 4
b. 5
c. 6
d. 7
సరైన సమాధానం : 5
36) లాగిన్ పేరు మరియు కంప్యూటర్ పాస్వర్డ్ ధృవీకరణ చేయడాన్ని ఏమి అంటారు?
a. Configuration
b. Accessibility
c. Authentication
d. Logging in
సరైన సమాధానం : Authentication
37) 2.2 కేజిలను గ్రాములలోకి మార్చండి?
a. 220 గ్రాములు
b. 2200 గ్రాములు
c. 22 గ్రాములు
d. 2000 గ్రాములు
సరైన సమాధానం : 2200 గ్రాములు
38) కోలకతా నగరం ఏ నది ఒడ్డున ఉంది ?
a. యమున
b. గంగా
c. సట్లేజ్
d. హూగ్లీ
సరైన సమాధానం : హూగ్లీ
39) 5515ను 100 స్థానం దగ్గర రౌండ్ చేస్తే ఈకింది వానిలో ఏ సంఖ్యకు దగ్గరగా ఉంటుంది
a. 550
b. 5000
c. 5500
d. 5600
సరైన సమాధానం : 5500
40) భారతదేశంలో ఏ నగరాన్ని పింక్ సిటీ (గులాబీ రంగు నగరం) అని పిలుస్తారు
a. జైపూర్
b. కలకత్తా
c. డిల్లీ
d. పూణె
సరైన సమాధానం : జైపూర్
41) భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు ఏది
a. ICICI బ్యాంకు
b. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
c. HDFC బ్యాంకు
d. IDBI బ్యాంకు
సరైన సమాధానం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
42) భారతదేశం యొక్క నేషనల్ ఆక్వాటిక్ జంతు పేరు ఏమిటి ?
a. రివర్ డాల్ఫిన్
b. మొసలి
c. షార్కు
d. బ్లూవేల్
సరైన సమాధానం : రివర్ డాల్ఫిన్
43) ముంబాయి నగరం యొక్క పాత పేరు ఏమిటి
a. ముంబే
b. ఆంకారా
c. కాన్పూరు
d. బాంబే
సరైన సమాధానం : బాంబే
44) భారతదేశంలో అతి పొడవైన నది ఏది
a. గంగా
b. సట్లేజ్
c. మహానది
d. కృష్ణ
సరైన సమాధానం : గంగా
45) x + 22 = 50 ఐతే, x యొక్క విలువ ఎంతో కనుగొనండి?
a. 18
b. 28
c. 38
d. 30
సరైన సమాధానం : 28
46) ఏ దేశాన్ని రైజింగ్ సన్ యొక్క భూమి అంటారు ?
a. దక్షిణ కోరియా
b. భారతదేశం
c. చైనా
d. జపాన్
సరైన సమాధానం : జపాన్
47) భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని స్పైస్ గార్డెన్ అని అంటారు ?
a. తమిళనాడు
b. కేరళ
c. కర్ణాటక
d. ఆంధ్రప్రదేశ్
సరైన సమాధానం : కేరళ
48) భారతదేశం క్రికెట్ ప్రపంచ కప్ ను ఎన్ని సార్లు గెలిచింది ?
a. అసలు లేదు
b. ఒక్కసారి
c. రెండు సార్లు
d. మూడు సార్లు
సరైన సమాధానం : రెండు సార్లు
49) మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ?
a. కిడ్నీ
b. గుండె
c. కాలేయం
d. ఊపిరితిత్తులు
సరైన సమాధానం : కాలేయం
50) కూడండి: 7123 + 9803 = ?
a. 16925
b. 16926
c. 16927
d. 16928
సరైన సమాధానం : 16926
సమాధానాలు
1)c2)a3)c4)b5)a6)a7)b8)b9)b10)c11)d12)c13)b14)a15)a16)b17)c18)d19)d20)c21)c22)a23)b24)d25)a
26)c27)b28)d29)b30)a31)b32)c33)a34)c35)b36)c37)b38)d39)c40)a41)b42)a43)d44)a45)b46)d47)b48)c49)c50)b