online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఆగష్టు-2012

1) కేటగిరి లను పోల్చడానికి ఏ గ్రాఫును ఉపయోగిస్తారు?
a. లీనియర్ గ్రాఫ్
b. బార్ గ్రాఫ్
c. పై గ్రాఫ్
d. హిస్టోగ్రామ్
సరైన సమాధానం : బార్ గ్రాఫ్
2) ఈ క్రిందివాటిలో ఏ ప్రతిపాదన సరైనది కాదు?
a. మూడు భుజాలు, రెండు అంతర్గత కోణాలు ఇస్తే ఒక అసమాన చతుర్భుజాన్నినిర్మించవచ్చు
b. రెండు కర్ణాలు, మూడు భుజాలు ఇస్తే, ఒక అసమాన చతుర్భుజాన్నినిర్మించవచ్చు
c. నాలుగు భుజాల పొడవులు మరియు ఒక కర్ణము ఇస్తే ఒక అసమానచతుర్భుజాన్ని నిర్మించవచ్చు
d. రెండు కర్ణాలు, ఒక భుజము, ఒక కోణము తెలిస్తే అసమాన చతుర్భుజాన్ని నిర్మించవచ్చు
సరైన సమాధానం : రెండు కర్ణాలు, ఒక భుజము, ఒక కోణము తెలిస్తే అసమాన చతుర్భుజాన్ని నిర్మించవచ్చు
3) "Everybody laughed" change it into question form.
a. are all laughed?
b. Did everybody laughed?
c. Does everybody laughed?
d. Do everybody laughed?
సరైన సమాధానం : Did everybody laughed?
4) ఒక యాథృచ్ఛిక ప్రయోగం అంటే...
a. ఒక మొత్తానికి, దానిలో భాగానికి ఉన్న సంబంధాన్ని చూపుతుంది
b. ఒక నిర్దిష్ట సంఖ్య ఎన్నిసార్లు వచ్చిందో చెబుతుంది
c. దేని ఫలితమైతే ఖచ్చితంగా ముందుగానే అంచనా వేయబడుతుందో ఆ సమస్య
d. దేని ఫలితమైతే ఖచ్చితంగా ముందుగానే అంచనా వేయబడలేదో ఆ సమస్య
సరైన సమాధానం : దేని ఫలితమైతే ఖచ్చితంగా ముందుగానే అంచనా వేయబడలేదో ఆ సమస్య
5) ab =
a. a - b
b. a + b
c. 10ab
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : పైవేవీ కాదు
6) ఒక దీర్ఘఘనంయొక్క ఉపరితల వైశాల్యం =
a. 2πr(r + h)
b. πr2h
c. 2(lb + bh + hl)
d. l3
సరైన సమాధానం : 2(lb + bh + hl)
7) ax2 + bx + c = 0 అనే వర్గ సమీకరణానికి
a. b2 – 4ac > 0 అయితే,రెండు విశిష్ట, వాస్తవ మూలాలు ఉంటాయి
b. b2 – 4ac = 0 అయితే రెండు సమాన మూలాలు ఉంటాయి
c. b2 – 4ac < 0 అయితే వాస్తవ మూలాలు ఉండవు
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
8) ఒక వృత్తముయొక్క కేంద్రంనుండి(లేదా సంబంధిత కేంద్రాలనుంచి) సమాన దూరంలో ఉండే జ్యాలు...
a. సమానం
b. సమానం కాదు
c. రెట్టింపు
d. సగం
సరైన సమాధానం : సమానం
9) ఒక ఆమ్లం మరియు లోహంమధ్య చర్య జరిగినపుడు...
a. కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది
b. ఉదజని వాయువు వెలువడుతుంది మరియు సంబంధిత లవణం ఏర్పడుతుంది
c. ఆమ్లజని వాయువు వెలువడుతుంది మరియు సంబంధిత లవణం ఏర్పడుతుంది
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : ఉదజని వాయువు వెలువడుతుంది మరియు సంబంధిత లవణం ఏర్పడుతుంది
10) ఈ క్రిందివాటిలో పర్యావరణ-అనుకూలమైన ప్రక్రియ ఏది?
a. వృధాగా నడుస్తున్న ఫ్యాన్లు, లైట్లను ఆఫ్ చేయుట
b. పాఠశాలకు మీ అమ్మగారి స్కూటర్ మీద వెళ్ళటానికి బదులు స్వయంగా నడిచి వెళ్ళుట
c. సరకులు కొనడానికి వెళ్ళేటపుడు గుడ్డసంచిని పట్టుకెళ్ళుట
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
11) విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి?
a. ఒక వాహకంద్వారా కదిలే ప్రోటాన్ల ప్రవాహం
b. ఒక వాహకం ద్వారా కదిలే ఎలక్ట్రాన్ల ప్రవాహం
c. శ్రేణిలో ఉండే అనేక నిరోధకాల యొక్క నిరోధానికి సమానం
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : ఒక వాహకం ద్వారా కదిలే ఎలక్ట్రాన్ల ప్రవాహం
12) మూలకాలను ఈ ప్రాతిపదికన వర్గీకరించారు...
a. రంగులు మరియు ఆకారాలు
b. బరువు మరియు బలం
c. వాటి గుణాలలోని పోలిక
d. గుణాలలోని బేధాలు
సరైన సమాధానం : వాటి గుణాలలోని పోలిక
13) జనరేటర్ యాంత్రికశక్తిని ఇలా మారుస్తుంది...
a. అయస్కాంతశక్తి
b. సౌరశక్తి
c. భూతాప శక్తి
d. విద్యుత్ శక్తి
సరైన సమాధానం : విద్యుత్ శక్తి
14) తుల్యజాతి అంగములకు ఉదాహరణ...
a. పక్షియొక్క రెక్క మరియు గుర్రంయొక్క ముందు కాలు
b. మిథైల్ మరియు ఇథైల్ ఆల్కహాల్ లు
c. మనిషి చేయి మరియు కుక్క ముందుకాలు
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
15) చలనము అంటే
a. స్థానభ్రంశం
b. కదిలిన దూరం
c. స్థాన చలనం
d. పైవన్నియూ
సరైన సమాధానం : పైవన్నియూ
16) జీవన ప్రమాణం మరియు జీవరాశిని దెబ్బతీసేది ఏమిటి?
a. భారీ వర్షాలు
b. గాలి, నీరు, నేలలలోని కాలుష్యం,
c. సౌరదీపాలు మరియు కుక్కర్లు
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : గాలి, నీరు, నేలలలోని కాలుష్యం,
17) ఈ క్రిందివాటిలో ఏ ప్రవచనం సరైనది కాదు?
a. అంటురోగాలను సంక్రమింపజేసే క్రిములు గాలి, నీరు, భౌతిక వాహకాలద్వారా లేదా రోగవాహకాలద్వారా వ్యాపిస్తాయి
b. వ్యాధికి విజయవంతంగా చికిత్స చేయడంకంటే నివారణ ఆవశ్యకం
c. అంటురోగాలను సంక్రమింపజేసే వాహకాలను పారిశుధ్య చర్యలద్వారా నిరోధించడంవలనే వ్యాధులను నివారించగలం
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : పైవేవీ కాదు
18) ఈ క్రిందివాటిలో ఏ ప్రవచనం సరైనది కాదు?
a. ఒక వస్తువును భూమి ఎంత బలంతో ఆకర్షిస్తుందో అదే ఆ వస్తువుయొక్క బరువు
b. ద్రవ్యరాశి మరియు భూ గురుత్వాకర్షణశక్తి వలన ఏర్పడే త్వరణం యొక్క లబ్దమే బరువు
c. భారము, ద్రవ్యరాశి ఒక్కో ప్రాంతానికీ ఒక్కొక్క రకంగా మారుతుంది
d. ఒక ద్రావకంలో ముంచినపుడు ప్రతి వస్తువూ ఒకరకమైన తేలికకలిగే అనుభూతి పొందుతాయి
సరైన సమాధానం : భారము, ద్రవ్యరాశి ఒక్కో ప్రాంతానికీ ఒక్కొక్క రకంగా మారుతుంది
19) ఈ క్రిందివాటిలో జంతు కణజాలం కానిదేది?
a. ఎపిథెలియల్
b. కనెక్టివ్
c. మస్క్యులర్
d. మెరిస్టమేటిక్
సరైన సమాధానం : మెరిస్టమేటిక్
20) ఈ క్రిందివాటిలో ఏ ప్రవచనం సరైనది కాదు?
a. తగిన విడపోత ప్రక్రియల ద్వారా మిశ్రమాలను శుద్ధ పదార్థాలుగా విడదీయవచ్చు
b. ప్రతి యూనిట్ ఘనపరిమాణానికీ ఉన్న ద్రావితం పరిమాణం లేదా ప్రతి యూనిట్ ద్రవ్యరాశికీ ఉన్న ద్రావణం/ద్రావణియే ఆ ద్రావణం యొక్క గాఢత
c. రసాయన చర్యలద్వారా చిన్నచిన్న పదార్థాలుగా విడగొట్టబడలేని ఒక పదార్థంయొక్క రూపమే మూలకం
d. ఒక మిశ్రమంలో ఒక పదార్థం మాత్రమే ఉంటుంది
సరైన సమాధానం : ఒక మిశ్రమంలో ఒక పదార్థం మాత్రమే ఉంటుంది
21) ఈ క్రిందివాటిలో ఏ ప్రవచనం సరైనది కాదు?
a. అన్ని విలువలను కూడి, ఆ విలువల సంఖ్యతో భాగించగా వచ్చిదే అంకగణిత సగటు
b. మధ్య విలువల మొత్తమే మధ్య్గగతము
c. బాగా ఎక్కువసార్లు వచ్చే విలువనే వ్యాప్తి అంటారు
d. ఒక నిర్దిష్ట ప్రయోజనంకోసం సేకరించిన సత్యాలు లేదా అంకెలనే దత్తాంశము అంటారు
సరైన సమాధానం : బాగా ఎక్కువసార్లు వచ్చే విలువనే వ్యాప్తి అంటారు
22) ఏ నదిని టిబెట్ దేశంలో చాంగ్ పో అని, బాంగ్లాదేశ్ దేశంలో జమున అని పిలుస్తారు?
a. తపతి
b. గోదావరి
c. బ్రహ్మపుత్ర
d. నర్మద
సరైన సమాధానం : బ్రహ్మపుత్ర
23) ఉప ఉష్ణమండల ప్రాంతంలో వార్షిక సగటు ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్ లో)...
a. 24oC కంటే ఎక్కువ
b. 7oC కంటే తక్కువ
c. 7oC నుంచి 17o C వరకు
d. 17oC నుంచి 24oC వరకు
సరైన సమాధానం : 17oC నుంచి 24oC వరకు
24) భారతదేశంలో మొదటి సంపూర్ణ జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం
a. 1871
b. 1881
c. 1891
d. 1901
సరైన సమాధానం : 1881
25) ఒక క్రియావిశేషణం వర్ణించేది...
a. ఒక వ్యక్తి పేరును
b. రెండు పదాలమధ్య సంబంధాన్ని
c. చర్యను
d. వ్యక్తిత్వాన్ని
సరైన సమాధానం : చర్యను
26) " కాలాన్ని వయసును బట్టికాక, ఆ వ్యక్తి ఏమి చేశాడు, ఏమి అనుకున్నాడు, ఏమి సాధించాడు అన్నదాన్నిబట్టి లెక్కించాలి." అని అన్నది...
a. రవీంద్రనాథ్ ఠాగూర్
b. జవహర్ లాల్ నెహ్రూ
c. ఎమ్ కె గాంధి
d. రాజీవ్ గాంధి
సరైన సమాధానం : జవహర్ లాల్ నెహ్రూ
27) ఉష్ణమండల ప్రాంతంలో బలమైన గాలులతో సంభవించే పెను తుపానును ఇలా పిలుస్తారు
a. హరికేన్
b. విర్ల్ విండ్
c. టైఫూన్
d. సైక్లోన్
సరైన సమాధానం : టైఫూన్
28) ఒక వ్యక్తి, తను ఎన్నుకోబడిన(ప్రజాప్రతినిధి పదవికి) పార్టీనుంచి వేరొక పార్టీలోకి మారడాన్ని ఇలా అంటారు...
a. ఎన్నిక‌
b. ఫిరాయింపు
c. వలస
d. పైవేవీ కాదు
సరైన సమాధానం : ఫిరాయింపు
29) ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమాచారంతో ప్రమాణపూర్తిగా సంతకం చేసి ఒక అధికారికి సమర్పించే పత్రాన్ని ఇలా పిలుస్తారు...
a. స్టాంపు పేప‌రు
b. ధ్రువ‌ప‌త్రం
c. ఆర్ టి ఐ ద‌రఖాస్తు
d. లిఖిత వాంగ్మూలం
సరైన సమాధానం : లిఖిత వాంగ్మూలం
30) ఈ క్రింద వాటిలో ఏది స‌రైన‌ది కాదు?
a. ప్రజాస్వామ్యం పౌరులలో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది
b. ప్రజాస్వామ్యం ఒక వ్యక్తియొక్క గౌరవాన్ని పెంపొందిస్తుంది
c. ప్రజాస్వామ్యం నిర్ణయాలు తీసుకునే నేర్పును పెంపొందిస్తుంది
d. ప్రజాస్వామ్యం ఘర్షణలను పరిష్కరించేందుకు మార్గాన్నేమీ అందించదు
సరైన సమాధానం : ప్రజాస్వామ్యం ఘర్షణలను పరిష్కరించేందుకు మార్గాన్నేమీ అందించదు
31) ప్రజాస్వామ్యము అంటే వీరి ప‌రిపాల‌న
a. అల్పసంఖ్యాక వర్గం
b. అధిక సంఖ్యాకవర్గం
c. ధ‌నికులు
d. వృత్తినిపుణులు
సరైన సమాధానం : అధిక సంఖ్యాకవర్గం
32) ఈ క్రింద వాటిలో ఏది స‌రైన‌ది కాదు?
a. ఇ-కామర్స్ అంటే ఎలక్ట్రానిక్-కామర్స్, ఇంటర్నెట్ ద్వారా కొనడం మరియు అమ్మడం
b. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే, అవతలివారిని చూస్తూ వారితో ఆన్ లైన్ లో మాట్లాడగలిగే సౌకర్యం
c. ఎటాచ్‌మెంట్‌లు అంటే ఇమెయిల్ తో మనం పంపగలిగే కాగితపు ఫైళ్ళు
d. డౌన్ లోడింగ్ అంటే ఇంటర్నెట్ నుంచి మన కంప్యూటర్ లోకి ఫైళ్ళను సేవ్ చేసుకోవడం
సరైన సమాధానం : ఎటాచ్‌మెంట్‌లు అంటే ఇమెయిల్ తో మనం పంపగలిగే కాగితపు ఫైళ్ళు
33) ఈ క్రింద వాటిలో ఏది స‌రైన‌ది కాదు?
a. సమీకరణాలు అనేవి ముందుగా రాయబడిన ఫార్ములాలు మరియు ఇవి “=” సంకేతంతో ప్రారంభమవుతాయి.
b. శ్రేణి అనేది ఒక పేరు ఇవ్వబడిన కొన్ని చిన్నగడుల సమూహం. శ్రేణి పేరులో మొదటి, ఆఖరి గడుల చిరునామాలుంటాయి మధ్యలో ఒక అడ్డగీత ఉంటుంది.
c. స్టాండర్డ్ టూల్ బార్ మీద ఉన్న ఆటో సమ్ బటన్, సంఖ్యలను తనంతట తనే తొలగిస్తుంది మరియు తొలగించాల్సిన సంఖ్యల శ్రేణిని సూచిస్తుంది.
d. ఛార్టులు అనేవి సమాచారాన్ని గ్రాఫులద్వారా చూపడానికి ఒక అద్భుత పరికరం మరియు సమాచారాన్ని విశ్లేషించడానికి, పోల్చడానికి బాగా సహాయ పడతాయి.
సరైన సమాధానం : స్టాండర్డ్ టూల్ బార్ మీద ఉన్న ఆటో సమ్ బటన్, సంఖ్యలను తనంతట తనే తొలగిస్తుంది మరియు తొలగించాల్సిన సంఖ్యల శ్రేణిని సూచిస్తుంది.
34) పౌర చట్టం అనేది ఈ క్రిందివాటిలో దీనికి పనికొస్తుంది…
a. నేరాలుగా చట్టంలో నిర్వచింపబడే ప్రవర్తన లేదా పనులను నిర్వహించడం లేదా చర్యతీసు కోవడం
b. సాధారణంగా ఇది పోలీసులవద్ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) నమోదు చేయడంతో ప్రారంభమవుతుంది
c. వ్యక్తుల హక్కులకు కలిగే నష్టం లేదా భంగం వాటిల్లినప్పుడు
d. నేరం రుజువైతే, నిందితులు జైలుకు పంపబడతారు మరియు జరిమానా కూడా విధించబడతారు
సరైన సమాధానం : వ్యక్తుల హక్కులకు కలిగే నష్టం లేదా భంగం వాటిల్లినప్పుడు
35) చట్టానికి భంగం కలిగించుట మరియు ప్రాథమిక హక్కులను అతిక్రమించుట లేదా మీరడము అనే చర్య...
a. తొల‌గింపు
b. ఉల్లంఘ‌న‌
c. విడుద‌ల‌
d. ప‌రిహార‌ము
సరైన సమాధానం : ఉల్లంఘ‌న‌
36) ఫీఫా (FIFA) అనే సంస్థ దీనికోసం పనిచేస్తుంది...
a. వ్యవసాయం
b. క్రయ విక్రయాలు
c. ఆటలు & క్రీడలు
d. చేపలు పట్టడం
సరైన సమాధానం : ఆటలు & క్రీడలు
37) గ్రాండ్ స్లామ్ అనే పదాన్ని ఈ ఆటలో ఉపయోగిస్తారు...
a. చెస్
b. టెన్నిస్
c. క్రికెట్
d. హాకీ
సరైన సమాధానం : టెన్నిస్
38) టెస్టులలో శతకత్రయం చేసిన భారత బ్యాట్స్ మన్ ఎవరు?
a. సచిన్ టెండూల్కర్
b. సునీల్ గవాస్కర్
c. వీరేందర్ సెహ్వాగ్
d. మహీందర్ సింగ్ ధోని
సరైన సమాధానం : వీరేందర్ సెహ్వాగ్
39) 2012 ఫైడ్ (FIDE ) ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఇక్కడ జరిగాయి....
a. న్యూఢిల్లీ, ఇండియా
b. మాస్కో, రష్యా
c. వాషింగ్టన్ డి.సి., అమెరికా
d. లండన్, యు.కె.
సరైన సమాధానం : మాస్కో, రష్యా
40) మారథాన్ పరుగుపందేనికి ప్రామాణిక దూరం
a. 40.175 కి.మీ.
b. 41.185 కి.మీ.
c. 42.195 కి.మీ.
d. 42 కి.మీ.
సరైన సమాధానం : 42.195 కి.మీ.
41) " tolerant" కి వ్యతిరేకపదం...
a. not tolerant
b. no tolerant
c. intolerant
d. untolerant
సరైన సమాధానం : intolerant
42) "గోరా" పుస్తక రచయిత....
a. ఆర్ కె నారాయణన్
b. తారా శంకర్ బందోపాథ్యాయ
c. రవీంద్రనాథ్ ఠాగూర్
d. మున్షీ ప్రేమ్ చంద్
సరైన సమాధానం : రవీంద్రనాథ్ ఠాగూర్
43) ట్రాఫిక్ నేరం మరియు శిక్షల సెక్షన్లకు సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది సరైనది కాదు?
a. డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం అనే చర్యకు సెక్షన్ 184 ఎమ్‌విఎ కింద రు.1000 జరిమానా
b. పోలీస్ అధికారితో అనుచిత ప్రవర్తనకు సెక్షన్ 179 ఎమ్‌విఎ కింద రు.1,000 జరిమానా
c. మద్యపానం చేసి డ్రైవ్ చేసినందుకు(శ్వాస పరీక్ష) సెక్షన్ 203, సెక్షన్ 185 ఎమ్‌విఎ కింద ఒక కోర్ట్ చలాన్
d. సీట్ బెల్ట్ వాడనందుకు సెక్షన్ సిఎమ్‌విఆర్ 138(3)/177 కింద జరిమానా లేదు
సరైన సమాధానం : సీట్ బెల్ట్ వాడనందుకు సెక్షన్ సిఎమ్‌విఆర్ 138(3)/177 కింద జరిమానా లేదు
44) అట్లాస్ మరియు యాక్సిస్ మధ్య ఉండే కదిలే కీలు ఏది?
a. శాడిల్
b. పివోట్
c. హింజ్
d. గ్లైడింగ్
సరైన సమాధానం : పివోట్
45) డెంగ్యూ జ్వరంసోకినవారిలో కనిపించే సాధారణ లక్షణములలో ఒకటి...
a. ఎర్రరక్తకణాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల
b. ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల
c. తెల్లరక్తకణాలలో గణనీయమైన తగ్గుదల
d. ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయమైన పెరుగుదల
సరైన సమాధానం : ప్లేటిలెట్స్ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల
46) శ్వాసకోశ వ్యవస్థ విధులకు సంబంధించి, ఈ క్రిందివాటిలో తప్పుడు ప్రవచనం...
a. గాలిని శుభ్రప‌రుచును
b. గాలిని వ్యాపింప చేయును
c. గాలిని వెచ్చప‌రుచును
d. గాలిని తేమ‌గా ఉంచును
సరైన సమాధానం : గాలిని శుభ్రప‌రుచును
47) మేరి ఒక ఇంటర్వ్యూకు వెళ్ళబోతోంది. అయితే, ఇంటర్వ్యూకు వెళ్ళబోయే ఐదు నిమిషాలముందు ఆమెకు చెమటలు పట్టడం, హృదయస్పందన పెరగడం, ఉఛ్వాసనిస్వాశల వేగం పెరగడం మొదలయింది. ఆమె స్థితికి కారణమైన హార్మోన్ ఏది?
a. ఆక్టోసిన్ మ‌రియు వాసోప్రెసిన్
b. ఈస్టోజ‌న్ మ‌రియు ప్రోజెస్టిరాన్
c. ఇన్సులిన్ మ‌రియు గ్లుకాగాన్
d. ఆండ్రిన‌లైన్ మ‌రియు నారాడ్రిన‌లైన్
సరైన సమాధానం : ఆక్టోసిన్ మ‌రియు వాసోప్రెసిన్
48) ప్రపంచ జనాభా దినం
a. డిసెంబర్ 11
b. జులై 11
c. మే 11
d. జనవరి 11
సరైన సమాధానం : జులై 11
49) Among the following which is in passive voice?
a. Students are playing
b. Reading is enjoyed by the students
c. Where are the students?
d. School is the right place for the students
సరైన సమాధానం : Reading is enjoyed by the students
50) Find the adjective from the following
a. apple
b. relaxes
c. accidentally
d. aggressive
సరైన సమాధానం : aggressive
సమాధానాలు
1)b2)d3)b4)d5)d6)c7)d8)a9)b10)d11)b12)c13)d14)d15)d16)b17)d18)c19)d20)d21)c22)c23)d24)b25)c
26)b27)c28)b29)d30)d31)b32)c33)c34)c35)b36)c37)b38)c39)b40)c41)c42)c43)d44)b45)b46)a47)a48)b49)b50)d