online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, ఫిబ్రవరి-2013

1) గణిత పెట్టెలోని ఏ సాధనము వృత్తాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది.
a. కోణమానిని
b. మూలమట్టము
c. వృత్తలేఖిని
d. స్కేలు
సరైన సమాధానం : వృత్తలేఖిని
2) ఈ కందివానిలో అతివేగంగా ప్రయాణించేది ఏది?
a. హెలికాప్టర్
b. రోదసీ నౌక
c. జెట్ విమానము
d. విమానము
సరైన సమాధానం : రోదసీ నౌక
3) ఈ కింది వాటిలో కర్రలతో ఆడే ఆట ఏది?
a. కబడ్డీ
b. ఖో – ఖో
c. హాకి
d. టెన్నీస్
సరైన సమాధానం : హాకి
4) ఈ క్రింది వాటిలో ఉపగ్రహ సాంకేతికత ఉపయోగం ఏది?
a. టెలిఫోన్ సేవలు
b. ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసార సేవలు
c. డెటా బదలాయింపు సేవలు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
5) ఒక వాహనముపై నిర్థారించబడిన పరిస్థితులలో రవాణా చేయుటకు (వాహనము బరువు మినహాయించి) పేర్కొన్న బరువును ఏమంటారు?
a. అధిక బరువు
b. పే లోడ్
c. తక్కువ బరువు
d. పైవేవి కావు
సరైన సమాధానం : పే లోడ్
6) 45.5 గ్రాములు , 8.95 గ్రాములు ,22.55 గ్రాములు లను కలపండి
a. 75.5 గ్రాములు
b. 76 గ్రాములు
c. 76.5 గ్రాములు
d. 77 గ్రాములు
సరైన సమాధానం : 77 గ్రాములు
7) 5,7,11,13, ___ ఈ శ్రేణిలో తరువాత సంఖ్య కనుగొనండి.
a. 15
b. 17
c. 19
d. 23
సరైన సమాధానం : 17
8) ఈ క్రింది వాటిలో ఏది పిల్లల దృష్టి సమస్య?
a. అస్పష్ట , ద్వంద దృష్టి
b. చదవడం, రాయడంలో కష్టం
c. తలనొప్పి లేదా కళ్ళమంట
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
9) 8.5 , 12.5 ల లబ్ధము =
a. 104.25
b. 105.25
c. 106.25
d. 107.25
సరైన సమాధానం : 106.25
10) ఒక దీర్ఘచతురస్త్రాకార క్షేత్రం పొడవు 855 మీటర్లు, వెడల్పు 395 మీటర్లు అయిన దాని చుట్టుకొలత కిలో మీటర్లలో ఎంత?
a. 1.25 కి.మీ
b. 1.75 కి.మీ
c. 2.5 కి.మీ
d. 2.75 కి.మీ
సరైన సమాధానం : 2.5 కి.మీ
11) గంటన్నర నుండి 48 నిమిషాలను తీసివేయండి.
a. 32 నిమిషాలు
b. 36 నిమిషాలు
c. 42 నిమిషాలు
d. 52 నిమిషాలు
సరైన సమాధానం : 42 నిమిషాలు
12) 13 కిలోల టమాట ధర రూ. 84.50. అయిన 19 కిలోల టమాట ధర కనుక్కోండి.
a. రూ. 111.75
b. రూ. 123.50
c. రూ.133.50
d. రూ.141.25
సరైన సమాధానం : రూ. 123.50
13) సర్వశిక్షా అభియాన్ లోగో ఏది?
a. పెన్సిల్ పై పిల్లలు
b. పళ్ళెం చుట్టూ పిల్లలు
c. పలక తో పుస్తకం
d. కలముతో కాగితం
సరైన సమాధానం : పెన్సిల్ పై పిల్లలు
14) కంప్యూటర్ అనేది ఒక
a. లోహపు పెట్టె
b. ప్లాస్టిక్ పెట్టె
c. ఎలక్ట్రానిక్ పరికరము
d. ఎలక్ట్రిక్ కుకర్
సరైన సమాధానం : ఎలక్ట్రానిక్ పరికరము
15) ఆటలో తుది నిర్ణయము ఎవరిది?
a. జట్టు నాయకుడు
b. ప్రేక్షకులు
c. అంపైర్
d. ఆటగాళ్ళు
సరైన సమాధానం : అంపైర్
16) Find the opposite for "exactly"
a. nearly
b. wrong
c. missing
d. approximately
సరైన సమాధానం : nearly
17) ఈ కిందివాటిలో సరిపోని దానిని గుర్తించండి
a. పాఠశాల
b. కళాశాల
c. విశ్వవిద్యాలయము
d. పరిశోధనా ప్రయోగశాల
సరైన సమాధానం : పరిశోధనా ప్రయోగశాల
18) పాము చేసే ధ్వని
a. హౌల్
b. హిస్
c. ఊఫ్
d. మ్యావ్
సరైన సమాధానం : హిస్
19) Find the superlative degree for "cloudy"
a. clouds
b. cloudier
c. cloudyst
d. cloudiest
సరైన సమాధానం : cloudiest
20) జాతీయ యువజన దినోత్సవం చేసుకునేది
a. నవంబర్ 12
b. డిసెంబర్12
c. జనవరి 12
d. ఫిబ్రవరి 12
సరైన సమాధానం : జనవరి 12
21) జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునేది
a. డిసెంబర్ 28
b. జనవరి 28
c. ఫిబ్రవరి 28
d. మార్చ్ 28
సరైన సమాధానం : ఫిబ్రవరి 28
22) 3.3 ÷ 30 లో శేషము కనుగొనండి
a. 10.1
b. 1.1
c. 0.11
d. 1.11
సరైన సమాధానం : 0.11
23) ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు వుంటాయి?
a. 5
b. 6
c. 7
d. 8
సరైన సమాధానం : 7
24) 15 ఆగష్టు 1872 లో జన్మించినవారు ఎవరు?
a. రవింద్రనాథ్ ఠాగూరు
b. అరవింద ఘోష్
c. యుక్తేశ్వర్ గిరి
d. బాల గంగాధర తిలక్
సరైన సమాధానం : అరవింద ఘోష్
25) భారతదేశంలో నటుడుగా మారిన కుస్తీవీరుడు 2012 లో మరణించాడు. అతను ఎవరు?
a. రాజేష్ ఖన్నా
b. ఎ కె హెంగల్
c. దారాసింగ్
d. అఛల సచ్ దేవ్
సరైన సమాధానం : దారాసింగ్
26) భారత సాయుధ దళాల అధిపతి ఎవరు?
a. భారతదేశ రాష్ట్రపతి
b. జనరల్
c. అడ్మిరల్
d. ఎయిర్ ఛీఫ్ మార్షల్
సరైన సమాధానం : భారతదేశ రాష్ట్రపతి
27) భారతదేశంలోని అతిపెద్ద కాంటిలివర్ వంతెన ఏది?
a. మహత్మాగాంధి సేతు
b. చంబల్ వంతెన
c. హౌరా వంతెన
d. పైవేవి కావు
సరైన సమాధానం : హౌరా వంతెన
28) భారతదేశంలో అతి పొడవైన నది
a. నర్మద
b. గంగ
c. గోదావరి
d. బ్రహ్మపుత్ర
సరైన సమాధానం : గంగ
29) దీని లోపం వల్ల రేచీకటి కలుగుతుంది.
a. విటమిన్ ఎ
b. విటమిన్ బి
c. విటమిన్ సి
d. విటమిన్ డి
సరైన సమాధానం : విటమిన్ ఎ
30) 111,99 మరియు 66 లో నుండి 199 ని తీసివేయండి=
a. 67
b. 77
c. 87
d. 97
సరైన సమాధానం : 77
31) 'హుకింగ్' అనే పదం ఏ ఆటకు సంబంధించినది.
a. హాకి
b. కబడ్డీ
c. క్రికెట్
d. ఫుట్ బాల్
సరైన సమాధానం : హాకి
32) ఈ కింది వానిలో చేతితో తయారుచేసినది.
a. మట్టి కుండ
b. ప్లాస్టిక్ పెట్టె
c. కంప్యూటర్
d. దర్పణము
సరైన సమాధానం : మట్టి కుండ
33) వినికిడి పై చేసే అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?
a. డెర్మిటాలజి
b. ఆడియాలజి
c. ఆస్ట్రోలజి
d. ఎకోలజి
సరైన సమాధానం : ఆడియాలజి
34) 666 ÷ 9 =
a. 64
b. 68
c. 74
d. 78
సరైన సమాధానం : 74
35) నోబెల్ సైన్స్ బహుమతికి అందజేసే నగదు బహుమతి ఎంత?
a. రూ. 1.3 కోట్లు
b. రూ. 4.3 కోట్లు
c. రూ. 8.3 కోట్లు
d. రూ. 12.3 కోట్లు
సరైన సమాధానం : రూ. 8.3 కోట్లు
36) శ్రీహరి వద్ద 9.5 కిలోల పాత పేపర్ వున్నది. దానికి అతను పాత పేపరు కొనుగోలుదారునుండి రూ.80.75 తీసుకున్నచో ఒక కిలో పేపరు ఖరీదు ఏంత?
a. రూ.6.50
b. రూ.7.25
c. రూ.8.50
d. రూ.9.25
సరైన సమాధానం : రూ.8.50
37) 31 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏది?
a. 32
b. 33
c. 35
d. 37
సరైన సమాధానం : 37
38) ఈ కిందివానిలో ఏది పెద్ద సంఖ్య?
a. లక్ష
b. వేయి
c. కోటి
d. పది లక్షలు
సరైన సమాధానం : కోటి
39) 3 ఘాతము 0 =
a. 0
b. 1
c. 2
d. 3
సరైన సమాధానం : 1
40) గుండె నుండి శరీరమంతటా రక్తం ప్రవహించడాని ఏమంటాము?
a. పరిగెత్తుట
b. ప్రసరణము
c. పడిపోవుట
d. పైవేవి కావు
సరైన సమాధానం : ప్రసరణము
41) ఈ కిందివానిలో ఏది నీటిపైన తేలుతుంది?
a. 5 రూపాయల నాణెము
b. మేకు
c. చాక్ పీస్ ముక్క
d. మంచుగడ్డ
సరైన సమాధానం : మంచుగడ్డ
42) సాలెపురుగునకు ఎన్ని కాళ్ళు ఉంటాయి?
a. 6
b. 8
c. 10
d. 12
సరైన సమాధానం : 8
43) భూమిపైన ఎతైన పర్వతం ఏది?
a. హిమాచూలి
b. మకలూ
c. మౌంట్ ఎవరెస్ట్
d. నందా దేవి
సరైన సమాధానం : మౌంట్ ఎవరెస్ట్
44) రూబి రత్నం యొక్క రంగు
a. నీలం
b. ఆకుపచ్చ
c. ఊదా
d. ఎరుపు
సరైన సమాధానం : ఎరుపు
45) ఏ రకమైన ఈత స్ట్రోక్ మెల్లనిది?
a. బట్టర్ ప్లై
b. బేక్ స్ట్రోక్
c. బ్రెస్ట్ స్ట్రోక్
d. ఫ్రీ స్ట్రోక్
సరైన సమాధానం : బ్రెస్ట్ స్ట్రోక్
46) విద్యుచ్ఛక్తిని కొలిచే ప్రమాణము
a. ఓమ్ లు
b. వాట్ లు
c. జౌల్ లు
d. పైవేవి కావు
సరైన సమాధానం : వాట్ లు
47) వృత్తకేంద్రము నుండి వృత్తము పైని బిందువుకు గల దూరము
a. వ్యాసము
b. ఛాపము
c. వ్యాసార్థము
d. స్పర్శరేఖ
సరైన సమాధానం : వ్యాసార్థము
48) యువజనుల కౌన్సెలింగ్ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్
a. 1800-180-1407
b. 1800-116-888
c. 1091
d. 1800-444-550
సరైన సమాధానం : 1800-116-888
49) The pen is mighter than the ________. జాతీయాన్ని పూర్తిచేయడానికి ఖాళిలోకి సరిఅయిన పదాన్ని ఎన్నుకోండి.
a. పెన్సిల్
b. కర్ర
c. కత్తి
d. పైవేవి కావు
సరైన సమాధానం : కత్తి
50) వాతావరణాన్ని అంచనావేయడానికి చేసే ప్రయత్నాన్ని _______________ వాతావరణ అంటారు.
a. నివేదిక
b. సూచన
c. నిర్మాణము
d. పరిమాణము
సరైన సమాధానం : సూచన
సమాధానాలు
1)c2)b3)c4)d5)b6)d7)b8)d9)c10)c11)c12)b13)a14)c15)c16)a17)d18)b19)d20)c21)c22)c23)c24)b25)c
26)a27)c28)b29)a30)b31)a32)a33)b34)c35)c36)c37)d38)c39)b40)b41)d42)b43)c44)d45)c46)b47)c48)b49)c50)b