online Quiz
print this article

తరగతి 9 నుండి 10 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జనవరి-2015

1) ఆమ్లాలలో కనిపించే సాధారణ మూలకం?
a. గంధకం
b. ఆమ్లజని
c. హైడ్రోజన్
d. నత్రజని
సరైన సమాధానం : హైడ్రోజన్
2) ఈ కింది వానిలో ఏది చాలా స్థిరమైన పర్యావరణ వ్యవస్థ?
a. అడవి
b. ఎడారి
c. పర్వతం
d. మహాసముద్రం
సరైన సమాధానం : మహాసముద్రం
3) 5, 16, 51, ​​158, ___ ఈ శ్రేణిని పూరించండి.
a. 363
b. 473
c. 481
d. 381
సరైన సమాధానం : 481
4) సంవర్గమానాన్ని ఎవరు కనుగొన్నారు?
a. జాన్ నేపియర్
b. థామస్ ఎడిసన్
c. రుథర్ ఫార్డ్
d. ఫ్రాంక్ విటిల్
సరైన సమాధానం : జాన్ నేపియర్
5) సముద్ర మట్టానికి పైనవున్న వస్తువులు చూడటానికి జలాంతర్గామిలో ఉపయోగించే పరికరము ఏది?
a. సూక్ష్మదర్శిని
b. వర్ణచిత్రదర్శిని
c. వర్ణపటదర్శిని
d. జోడు దుర్భిణి
సరైన సమాధానం : వర్ణచిత్రదర్శిని
6) దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన 17వ ఆసియా క్రీడల్లో భారతదేశం ఎన్ని బంగారు పతకాలు సాధించింది?
a. 9
b. 10
c. 11
d. 12
సరైన సమాధానం : 11
7) దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన 17వ ఆసియా క్రీడల్లో 151 బంగారు పతకాలతో అగ్రస్థానంలో వున్నది?
a. జపాన్
b. దక్షిణ కొరియా
c. ఖజకిస్తాన్
d. చైనా
సరైన సమాధానం : చైనా
8) నైట్రస్ ఆక్సైడ్ యొక్క సాధారణ నామము?
a. లాఫింగ్ వాయువు
b. ఎప్సోమ్
c. క్లోరోఫామ్
d. మార్ష్ వాయువు
సరైన సమాధానం : లాఫింగ్ వాయువు
9) మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన శుభ్రతా ఉద్యమం పేరు ఏమిటి?
a. స్వచ్చ భారత్
b. మెక్ ఇండియా క్లిన్
c. ఆదర్శ్ గ్రామ్ యోజన
d. స్వచ్చ భారత్ అభియాన్
సరైన సమాధానం : స్వచ్చ భారత్ అభియాన్
10) ఆంగ్ల నిఘంటువు ననుసరించి కింది పదాలను వరుసగా వుంచండి : 1. Voyage 2. Voice 3. Vocation 4. Volume
a. 2, 4, 3, 1
b. 3, 2, 4, 1
c. 2, 3, 4, 1
d. 3, 4, 2, 1
సరైన సమాధానం : 3, 2, 4, 1
11) అత్యంత సాధారణ రకం కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ______________ సాఫ్ట్ వేర్ అంటాము.
a. కమ్యూనికేషన్
b. అప్లికేషన్
c. సిస్టం
d. వర్డ్ ప్రాసెసింగ్
సరైన సమాధానం : సిస్టం
12) మైక్రోమ్యాక్స్ ఏ దేశానికి చెందిన బ్రాండ్?
a. చైనా
b. దక్షిణ కొరియా
c. భారతదేశం
d. జపాన్
సరైన సమాధానం : భారతదేశం
13) ఒక దుకాణదారుడు వరుసగా 10% మరియు 20% రుసుము ప్రకటించించాడు. దీనికి సమానమైన రుసుము శాతాన్ని కనుగొనండి.
a. 27%
b. 28%
c. 29%
d. 30%
సరైన సమాధానం : 28%
14) ఇటీవల నలంద విశ్వవిద్యాలయం, రాజగిర్, బీహార్ వద్ద పునరుద్ధరించబడి పనిచేయడం మొదలు పెట్టింది. దీని కులపతి ఎవరు?
a. అబ్దుల్ కలామ్
b. ప్రొఫెసర్ అమర్త్యసేన్
c. ప్రొఫెసర్ భూపిందర్ జుట్షి
d. డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర
సరైన సమాధానం : ప్రొఫెసర్ అమర్త్యసేన్
15) ద్రువనక్షత్రం ఈ కూటమిలో ఒక భాగం
a. ఉర్సా మైనర్
b. ఉర్సా మేజర్
c. ఓరియన్
d. హైడ్రా
సరైన సమాధానం : ఉర్సా మైనర్
16) 228, 224, 208, 172, 108, ___ శ్రేణిని పూర్తిచేయండి
a. 8
b. 34
c. 51
d. 78
సరైన సమాధానం : 8
17) కామన్వెల్త్ గేమ్స్ 2014, గ్లాస్గో (స్కాట్లాండ్) లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో వుంది?
a. ఆస్ట్రేలియా
b. ఇంగ్లాండ్
c. భారతదేశం
d. కెనడా
సరైన సమాధానం : ఇంగ్లాండ్
18) నోబెల్ శాంతి బహుమతి 2014 పొందినవారు?
a. కైలాష్ సత్యార్ధి
b. మలాలా యూసప్ ఝా
c. కైలాష్ సత్యార్ధి మరియు మలాలా యూసప్ ఝా ఇరువురు
d. పై ఎవరు కారు
సరైన సమాధానం : కైలాష్ సత్యార్ధి మరియు మలాలా యూసప్ ఝా ఇరువురు
19) Idiom - To Bite The Dust means?
a. To be defeated in battle
b. To learn a lesson
c. To be ashamed of
d. To work very hard
సరైన సమాధానం : To be defeated in battle
20) భారతదేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి?
a. రాజ్ నాథ్ సింగ్
b. సుష్మా స్వరాజ్
c. అరుణ్ జైట్లీ
d. మేనక గాంధీ
సరైన సమాధానం : అరుణ్ జైట్లీ
21) ఒక దీర్ఘచతురస్రాకార క్షేత్రం వెడల్పు దాని పొడవులో 75% ఉంది. దాని చుట్టుకొలత 1,050 మీటర్లు అయిన దాని వైశాల్యం ఎంత?
a. 62000
b. 65000
c. 67500
d. 68500
సరైన సమాధానం : 67500
22) రాహుల్ పాఠశాల నుండి మొదలై రెండు సార్లు కుడివైపునకు తిరిగి తరువాత ఒకసారి ఎడమవైపునకు తిరిగి దక్షిణం వైపు నడుస్తున్నాడు. అయితే రాహుల్ పాఠశాల నుండి ఏ దిశలో నడక ప్రారంభించాడు?
a. పడమర
b. తూర్పు
c. దక్షిణం
d. ఉత్తరం
సరైన సమాధానం : తూర్పు
23) గూగుల్ , ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, క్రోమ్ లలో విభిన్నమైన దానిని గుర్తించండి.
a. గూగుల్
b. ఫైర్ ఫాక్స్
c. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్
d. క్రోమ్
సరైన సమాధానం : గూగుల్
24) Choose the word which is nearly the same in meaning to ENCROACH?
a. Approach
b. Intrude
c. Destroy
d. Damage
సరైన సమాధానం : Intrude
25) యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో హిందీ లో ప్రసంగించిన రెండవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. మొదటి ప్రధాన మంత్రి ఎవరు?
a. రాజీవ్ గాంధీ
b. మన్మోహన్ సింగ్
c. అటల్ బిహారీ వాజ్ పాయి
d. ఇందిరా గాంధీ
సరైన సమాధానం : అటల్ బిహారీ వాజ్ పాయి
26) ఒక పటములో 8.8 కిలోమీటర్లను 0.8 సెం.మీ.గా సూచించారు. పటములో వారణాసి, ఢిల్లీల మధ్య దూరం 80.5 సెం.మీ. ఉంటే, రెండింటి మధ్యగల దూరాన్ని కిలోమీటర్లలో కనుగొనండి?
a. 99 కిలోమీటర్లు
b. 770 కిలోమీటర్లు
c. 890 కిలోమీటర్లు
d. 885.5 కిలోమీటర్లు
సరైన సమాధానం : 885.5 కిలోమీటర్లు
27) ఎడ్వర్డ్ జెన్నర్ కి దీనితో సంబంధం కలిగివున్నాడు
a. కలరా
b. టైఫాయిడ్
c. స్మాల్ పోక్స్
d. పక్షవాతం
సరైన సమాధానం : స్మాల్ పోక్స్
28) USB యొక్క పూర్తి రూపం?
a. Universal Serial Bus
b. Urgent Sent Bit
c. Ultimate Service Bit
d. Universal Sent Bit
సరైన సమాధానం : Universal Serial Bus
29) Fill in the blanks: Why did you confide your secrets ………………. stranger?
a. with
b. to
c. at
d. on
సరైన సమాధానం : to
30) రెండు పెద్ద భూ భాగాలను కలిపే సన్నని భూ ఖండాన్ని ఏమంటారు?
a. ద్వీపకల్పం
b. సముద్రంలోకి చొచ్చుకుని ఉన్న అగ్రము
c. భూసంధి
d. జలసంధి
సరైన సమాధానం : భూసంధి
31) ఇప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుని వయస్సు కు 3 రెట్లు. ఐదు సంవత్సరాల క్రితం తండ్రి తన కొడుకు వయస్సుకు ఏడు రెట్లు అయిన ప్రస్తుతం కుమారుని వయస్సు ఎంత?
a. 10
b. 15
c. 20
d. 40
సరైన సమాధానం : 10
32) ఈ కింది వాటిలో ఏది అత్యంత వేగవంతమైన దత్తాంశ ప్రసారానని సూచిస్తుంది?
a. bps
b. kbps
c. mbps
d. gbps
సరైన సమాధానం : gbps
33) P , N కి సోదరుడు. O, N కి కుమార్తె. R, P యొక్క సోదరి మరియు Q , O యొక్క సోదరుడు. అయిన Q యొక్క అంకుల్ ఎవరు?
a. P
b. O
c. N
d. R
సరైన సమాధానం : P
34) ఏదైనా ఒక ఆశయం కొరకు ప్రాణ త్యాగం చేసేవారు
a. దేశభక్తుడు
b. అమరజీవి
c. సైనికుడు
d. విప్లవకారుడు
సరైన సమాధానం : అమరజీవి
35) 14 మంది విద్యార్థుల సగటు మార్కు 71 గా లెక్కించబడింది. కానీ ఒక విద్యార్థి మార్కులు 56 కు బదులుగా 42, ఇంకొకరివి 32 కు బదులుగా 74 గా పోరపాటు జరిగినట్లు గుర్తించడమైంది. అయిన సరైన సగటు ఎంత?
a. 67
b. 68
c. 69
d. 70
సరైన సమాధానం : 69
36) Choose the correct alternative: I love him because he is a good man by heart.
a. at heart
b. of heart
c. in heart
d. No improvement
సరైన సమాధానం : at heart
37) భారతదేశం విజయవంతంగా మార్స్ కక్ష్యలోకి అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టడం ద్వారా చరిత్ర సృష్టించిది. ఈ మిషన్ పేరు ఏమిటి?
a. మారినర్ 4
b. మార్స్ ఆర్బిటర్ మిషన్
c. వైకింగ్ 1
d. మార్స్ పాత్ ఫైండర్
సరైన సమాధానం : మార్స్ ఆర్బిటర్ మిషన్
38) ఒక పుస్తకాన్ని 10% నష్టంతో విక్రయించారు. ఒకవేళ అమ్మకపు వెల 40 రూపాయలు ఎక్కువగా వుంటే 15% లాభం వచ్చేది. అయిన ఆ పుస్తకం అమ్మిన ధర ఎంత?
a. 175 రూపాయలు
b. 160 రూపాయలు
c. 140 రూపాయలు
d. 120 రూపాయలు
సరైన సమాధానం : 160 రూపాయలు
39) 270 మీటర్ల పొడవుగల రైలు,గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు 180 మీటర్ల వంతెన దాటడానికి పట్టే సమయం ఎంత?
a. 35 సెకన్లు
b. 40 సెకన్లు
c. 45 సెకన్లు
d. 50 సెకన్లు
సరైన సమాధానం : 45 సెకన్లు
40) ఈ కింది వాటిలో ఏది భారతదేశం గుండా వెళ్లుతున్నది?
a. మకర రేఖ
b. కర్కటరేఖ
c. భూమధ్యరేఖ
d. 0 డిగ్రీ రేఖాంశం
సరైన సమాధానం : కర్కటరేఖ
41) Choose the word which is most OPPOSITE in meaning to the word - CEASE
a. Mount
b. Mend
c. Start
d. Announce
సరైన సమాధానం : Start
42) Choose the word which is most nearly same in meaning to the word - MARVEL
a. Surpass
b. Project
c. Misfire
d. Wonder
సరైన సమాధానం : Wonder
43) ఒక క్వింటాల్ నకు సమానమైనది
a. 1 కిలో
b. 10 కిలోలు
c. 100 కిలోలు
d. 1000 కిలోలు
సరైన సమాధానం : 100 కిలోలు
44) పంకజ్ అద్వానీ ఏ క్రీడకు సంభందించినవాడు?
a. క్రికెట్
b. చదరంగం
c. బ్యాడ్మింటన్
d. స్నూకర్
సరైన సమాధానం : స్నూకర్
45) రూ. 700 లను A, B, C లకు పంపిణీ చేసారు. అందులో C కి వచ్చిన వాటాలో సగం B కి, B కి వచ్చిన వాటాలో సగం A కి వచ్చాయి. అయితే C వాటా ఎంత?
a. 600 రూపాయలు
b. 400 రూపాయలు
c. 300 రూపాయలు
d. 200 రూపాయలు
సరైన సమాధానం : 400 రూపాయలు
46) Which one of the following word is correctly spelt?
a. Scenary
b. Granery
c. Visionary
d. Luminery
సరైన సమాధానం : Visionary
47) 3, 7, 15, ___ , 63, 127 శ్రేణిలో ఖాళీలోని సంఖ్యను కనుగొనండి.
a. 30
b. 31
c. 47
d. 52
సరైన సమాధానం : 31
48) ఆడ ఎనాఫిలస్ దోమ కారణంగా మలేరియా వస్తుందని ఎవరు కనుగొన్నారు?
a. లూయిస్ పాశ్చర్
b. రాబర్ట్ కోచ్
c. రోనాల్డ్ రాస్
d. ఎడ్వర్డ్ జెన్నర్
సరైన సమాధానం : రోనాల్డ్ రాస్
49) ASCII అనగా
a. American Stable Code for International Interchange
b. American Standard Code for Information Interchange
c. American Standard Code for Institutional Interchange
d. American Standard Code for Interchange Information
సరైన సమాధానం : American Standard Code for Information Interchange
50) ఇటీవల ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం ఎంపిక చేయబడిన భారత బాక్సర్?
a. విజేందర్ సింగ్
b. మనోజ్ కుమార్
c. సుశీల్ కుమార్
d. మేరీ కోమ్
సరైన సమాధానం : మనోజ్ కుమార్
సమాధానాలు
1)c2)d3)c4)a5)b6)c7)d8)a9)d10)b11)c12)c13)b14)b15)a16)a17)b18)c19)a20)c21)c22)b23)a24)b25)c
26)d27)c28)a29)b30)c31)a32)d33)a34)b35)c36)a37)b38)b39)c40)b41)c42)d43)c44)d45)b46)c47)b48)c49)b50)b