online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూలై-2013

1) ₹ 275 లకు మూడింతలు ఎంత??
a. ₹ 725
b. ₹ 775
c. ₹ 825
d. ₹ 875
సరైన సమాధానం : ₹ 825
2) 95 డిగ్రీలు, 60 డిగ్రీలు మరియు 25 డిగ్రీలు కొలతలుగా గల త్రిభుజమును ఎమంటారు?
a. అధికకోణ త్రిభుజము
b. లంబకోణ త్రిభుజము
c. అల్పకోణ త్రిభుజము
d. పైవేవి కావు
సరైన సమాధానం : అధికకోణ త్రిభుజము
3) సాధారణంగా విషసర్పాలు ఎన్ని రకాలు?
a. 4
b. 22
c. 36
d. 59
సరైన సమాధానం : 4
4) ఈ కింది వాటిలో గాలి కాలిష్యానికి కారణం కానిదేది?
a. రసాయనిక క్రిమిసంహారక మందులు
b. ఎరువుల ధూళి
c. బొగ్గు మరియు శిలాజ ఇందనము
d. చెట్ల పెంపకం
సరైన సమాధానం : చెట్ల పెంపకం
5) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదటిసారిగా ఎప్పుడు ప్రచురించబడింది
a. 1986
b. 1990
c. 1996
d. 2000
సరైన సమాధానం : 1990
6) "IQ" పూర్తి వివరణ
a. Improved Quota
b. Indian Queen
c. Inter questions
d. Intelligence quotient
సరైన సమాధానం : Intelligence quotient
7) మానవ శరీరంలోని కిడ్నిలు ఇలా పనిచేస్తాయి
a. పంపు
b. వడగట్టు సాధనము
c. కవాటము
d. మూత
సరైన సమాధానం : వడగట్టు సాధనము
8) ఈ కింది వాటిలో ఏది మంచి ప్రవర్తన?
a. ఇతరుల పట్ల దయకలిగి వుండుట
b. ఏదైనా ఇవ్వ చూపినప్పుడు 'ధన్యవాదాలు' తెల్పడం
c. సమయపాలన పాటించడం. ఇది జవాబుదారీతనం మరియు బాధ్యతను సూచిస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
9) కింది వాటిలో బలమైన దానిని కనుగొనండి?
a. ప్లాస్టిక్ పైపు
b. స్టీల్ పైపు
c. చక్క పైపు
d. గాజు పైపు
సరైన సమాధానం : స్టీల్ పైపు
10) "ట్రక్కు" అనే పదం దేనికి సంబంధించినది.
a. ఎగరడానికి
b. రవాణా
c. సముద్ర ప్రయాణము
d. పైవన్ని
సరైన సమాధానం : రవాణా
11) బాలుర బాస్కెట్ బాల్ ఆటలో ఒక బృందంలో ఎంతమంది ఆటగాళ్ళు వుంటారు?
a. 8
b. 12
c. 20
d. 6
సరైన సమాధానం : 12
12) శరీరము సరిగా పనిచేయుటకు అవసరమైనది ఏది?
a. డబ్బు
b. విటమిన్లు
c. నోటు పుస్తకాలు
d. రంగు
సరైన సమాధానం : విటమిన్లు
13) ఈ క్రింది వాటిలో ఏది బాహ్యంగా నిల్వచేసే పరికరం కాదు?
a. పెన్ డ్రైవ్
b. సిడి
c. డివిడి
d. హార్డ్ డిస్క్ డ్రైవ్
సరైన సమాధానం : హార్డ్ డిస్క్ డ్రైవ్
14) 505, 808, 303 మరియు185 ల మొత్తమెంత?
a. 1821
b. 1801
c. 1791
d. 1781
సరైన సమాధానం : 1801
15) "trueopmc" యొక్క క్రమాన్ని మార్చి అర్థవంతమైన పదాన్ని వచ్చేలా చేయండి
a. truepocm
b. compurte
c. computer
d. truecomp
సరైన సమాధానం : computer
16) ఈ కిందివానిలో ఏది భారతదేశానికి సంబంధము లేనిది?
a. బెట్వా
b. ఫాంగ్ పై
c. ఫ్రాంక్ ఫర్ట్
d. సాలార్ జంగ్ మ్యూజియం
సరైన సమాధానం : ఫ్రాంక్ ఫర్ట్
17) 7, 15, 24, 34, _____.ఈ శ్రేణిలోని తర్వాత సంఖ్యను కనుగొనండి?
a. 44
b. 45
c. 46
d. 47
సరైన సమాధానం : 45
18) ఎవరు ఉత్తములు?
a. చెడు ప్రవర్తనతో కూడిన బలమైన వ్యక్తి
b. తెలివిగల స్వార్థపరుడు మరియు అహంకారి
c. దయాహృదయుడు మరియు ఇతరులకు సహాయంచేసే వ్యక్తి
d. సంఘవ్యతిరేకపనులు చేసే సంపన్నుడు
సరైన సమాధానం : దయాహృదయుడు మరియు ఇతరులకు సహాయంచేసే వ్యక్తి
19) చీమలు ఈ రకానికి చెందినవి
a. పక్షులు
b. ఉభయచరాలు
c. కీటకము
d. క్షీరదాలు
సరైన సమాధానం : కీటకము
20) లక్ష్మీ దగ్గర 14 రంగు స్కెచ్ పెన్నులుకల 8 పాకెట్స్ ఉన్నాయి. ఆమె సరితకు 21 స్కెచ్ పెన్నులు ఇచ్చింది. ఇప్పుడు ఆమె వద్ద ఎన్ని పెన్నులు వున్నాయి?
a. 89
b. 91
c. 95
d. 101
సరైన సమాధానం : 91
21) 999, 998 ల లబ్ధము =
a. 997002
b. 998002
c. 999002
d. 99902
సరైన సమాధానం : 997002
22) 5534 నుండి 5432 ను తీసివేయండి
a. 98
b. 102
c. 108
d. 112
సరైన సమాధానం : 102
23) భారతదేశంలోని ఏ రాష్ట్రంతో " కథక్" నృత్యం సంబంధం కలిగి వుంది?
a. తమిళనాడు
b. మణిపూర్
c. ఉత్తర ప్రదేశ్
d. ఒడిసా
సరైన సమాధానం : ఉత్తర ప్రదేశ్
24) ఈత వలన ఉపయోగాన్ని కనుగొనండి?
a. ఈత ఏకకాలంలో వివిధ కండరాలను బలోపేతం చేస్తుంది
b. ఈత ఎక్కువగానున్న ఒత్తిడిని విడుదలచేసి మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది
c. ఇది శ్వాసక్రియను నియంత్రిస్తుంది, రక్తప్రసారాన్ని ఉద్దీపన చేస్తుంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
25) ఈ కిందివానిలో ఏది సరిఅయినది?
a. కేలిక్యులేటర్ పదాలను అంగీకరిస్తుంది
b. సాంప్రదాయ టైప్ రైటర్ డాక్యుమెంట్లను భద్రపరుస్తుంది
c. పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ నుండి దూరంచేయలేము
d. సిడిలను, డివిడిలను సులభంగా తీసుకుపోగలము
సరైన సమాధానం : సిడిలను, డివిడిలను సులభంగా తీసుకుపోగలము
26) రెండు రూపాయలు 8 బిస్కెట్లకు సమానం అయితే, అయితే పది రూపాయలకు సమానం
a. 80 బిస్కెట్లు
b. 60 బిస్కెట్లు
c. 40 బిస్కెట్లు
d. 20 బిస్కెట్లు
సరైన సమాధానం : 40 బిస్కెట్లు
27) "బేంగిల్ సిటి" అని దేనిని పిలుస్తారు?
a. సూరత్
b. బెంగుళూరు
c. ఉదయ్ పూర్
d. హైదరాబాద్
సరైన సమాధానం : హైదరాబాద్
28) RTE 2009 లోని ఏ సెక్షన్ కింద అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 25 శాతం రిజర్వేషన్లు ఒకటవ క్లాస్ లో ప్రవేశానికి అందిస్తుంది
a. సెక్షన్ 12
b. సెక్షన్ 21(1) & 21(2)
c. సెక్షన్ 19
d. పైవేవి కావు
సరైన సమాధానం : సెక్షన్ 12
29) 'హీలియం' సంకేతము ఏమిటి?
a. H
b. He
c. Ho
d. Hs
సరైన సమాధానం : He
30) 8,2, -1 లను గుణించండి
a. 11
b. -11
c. 16
d. -16
సరైన సమాధానం : -16
31) నీటిలో తేలెగుణమును కనిపెట్టినది ఎవరు?
a. న్యూటన్
b. ఆర్కిమెడిస్
c. ఐన్ స్టీన్
d. గెలీలియో
సరైన సమాధానం : ఆర్కిమెడిస్
32) అన్ని భుజములు సమానముగా వుంటే ఆ త్రిభుజమును ఏమంటారు?
a. అసమబాహు త్రిభుజము
b. సమద్విబాహు త్రిభుజము
c. సమబాహు త్రిభుజము
d. పైవేవికావు
సరైన సమాధానం : సమబాహు త్రిభుజము
33) ఈ కిందివానిలో 9 చే నిశ్శేషముగా భాగించబడే సంఖ్య ఏది? ?
a. 9918
b. 3663
c. 7128
d. All of the above
సరైన సమాధానం : All of the above
34) హరి 12 డజనుల అరటిపండ్లు తెచ్చాడు. పాల్గొన్న ప్రతివారికి రెండు అరటిపండ్లు ఇవ్వగా, ఎందరు పాల్గొన్నవారు అవి అందుకున్నారు?
a. 6
b. 68
c. 72
d. 78
సరైన సమాధానం : 72
35) మొబైల్ నెంబర్ లో ఎన్ని సంఖ్యలు వుంటాయి?
a. 8
b. 9
c. 10
d. 12
సరైన సమాధానం : 10
36) ఈ కిందివానిలో ఏది అతిచిన్న సంఖ్య?
a. 1.506
b. 1.516
c. 1.5006
d. 1.5013
సరైన సమాధానం : 1.5006
37) ` 50 లో 15 % ఎంత?
a. ₹ 5
b. ₹ 7.5
c. ₹ 10
d. ₹ 12.5
సరైన సమాధానం : ₹ 7.5
38) జపాను రాజధాని ఏది?
a. ఆబుధాభి
b. టొక్యో
c. బ్యాంకాక్
d. ఖాట్మాండ్
సరైన సమాధానం : టొక్యో
39) ఈ కిందివానిలో ఏది భారతదేశ తూర్పు భూభాగములోని చివరి ప్రదేశము?
a. కిబుతూ, అరుణాచల్ ప్రదేశ్
b. గుహార్ మోత, గుజరాత్
c. సియాచిన్ గ్లాసియర్
d. ఇందిరా పాయింట, గ్రేట్ నికోబార్, అండమాన్ & నికోబార్ దీవులు
సరైన సమాధానం : కిబుతూ, అరుణాచల్ ప్రదేశ్
40) "You are born to blossom"? అనే పుస్తక రచయిత ఎవరు?
a. మహత్మాగాంధి
b. ఇందిరా గాంధి
c. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
d. డా. ఎ.పి.జి. అబ్దుల్ కలాం
సరైన సమాధానం : డా. ఎ.పి.జి. అబ్దుల్ కలాం
41) 85 X 101 =?
a. 805
b. 580
c. 850
d. 8510
సరైన సమాధానం : 850
42) రోజువారి యోగ చేయడంవలన కలిగే ప్రయోజనము ఏమిటి?
a. బరువు తగ్గడం
b. ఒత్తిడి నుండి విశ్రాంతి
c. రోగనిరోధక శక్తి పెరుగుదల
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
43) ప్రపంచ నవ్వుల దినము ఎప్పుడు జరుపుకుంటారు?
a. మే నెల మొదటి ఆదివారము
b. మే నెల రెండవ ఆదివారము
c. మే నెల మూడవ ఆదివారము
d. మే నెల నాల్గవ ఆదివారము
సరైన సమాధానం : మే నెల మొదటి ఆదివారము
44) భారతీయ సినిమా ఎన్ని సంవత్సరాలు పూర్తిచేసుకుంది?
a. 50
b. 75
c. 100
d. 125
సరైన సమాధానం : 100
45) గుండె అధ్యయనాన్ని ఏమంటారు?
a. కారియోలజి
b. క్రైలోలజి
c. కార్డియాలజి
d. సైటోలజి
సరైన సమాధానం : కార్డియాలజి
46) ఐ ఐ టి ముంబాయికి చెందిన ఎవరు "₹" సంకేతాన్ని రూపొందించారు?
a. డి. రాజ్ కుమార్
b. డి. ఉదయ్ కుమార్
c. టి. శ్రవణ్ కుమార్
d. పైవారు ఎవరూ కాదు
సరైన సమాధానం : డి. ఉదయ్ కుమార్
47) చట్టపరంగా భారతజాతీయ జెండా తప్పనిసరిగా దేనితో తయారుచేయాలి?
a. పట్టు
b. ఖాది
c. జీన్స్
d. ఎదైనా బట్ట
సరైన సమాధానం : ఖాది
48) ఏ మహిళా షట్లర్, యోనెక్స్ – సన్ రైజ్ మలేషియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంటు 2013 గెలిచారు?
a. సైనా నెహ్వాల్
b. జూన్ గు
c. పి.వి.సింధూ
d. విటా మరిస్సా
సరైన సమాధానం : పి.వి.సింధూ
49) వార్తాపత్రికకు రాసేవారిని ఏమని పిలుస్తారు?
a. కాంపోజిటర్
b. జర్నలిస్ట్
c. కేప్టన్
d. ఆప్టిషియన్
సరైన సమాధానం : జర్నలిస్ట్
50) "blossom" నకు వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి
a. fade
b. shrink
c. wither
d. All of the above
సరైన సమాధానం : All of the above
సమాధానాలు
1)c2)a3)a4)d5)b6)d7)b8)d9)b10)b11)b12)b13)d14)b15)c16)c17)b18)c19)c20)b21)a22)b23)c24)d25)d
26)c27)d28)a29)b30)d31)b32)c33)d34)c35)c36)c37)b38)b39)a40)d41)c42)d43)a44)c45)c46)b47)b48)c49)b50)d