online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, జూలై-2013

1) "If we can really understand the problem, the answer will come out of it, because the answer is not separate from the problem." ఈ కోట్స్ లో వున్న మాటలు ఎవరన్నారు?
a. రవింద్రనాథ్ ఠాగూర్
b. మహాత్మాగాంధి
c. జిడ్డు కృష్ణమూర్తి
d. శ్రీ అరభిందో
సరైన సమాధానం : జిడ్డు కృష్ణమూర్తి
2) " Knowing is not enough we must apply. Willing is not enough we must do." పెద్ద అక్షరాలలో మరియు కిందగీత గీయబడిన పదానికి ఆంగ్ల బాషా భాగాన్ని గుర్తించండి
a. Adjective
b. Pronoun
c. Preposition
d. adverb
సరైన సమాధానం : Adjective
3) మాంసకృత్తులు వున్నాయని ఏ రంగు వలన గుర్తిస్తాము?
a. ఎరుపు
b. నీలం
c. పసుపు
d. ఉదా
సరైన సమాధానం : ఉదా
4) 28 ని 1/4 చే భాగించిన ఎంత వస్తుంది?
a. 7
b. 112
c. 28.4
d. 2814
సరైన సమాధానం : 112
5) ఏ పదార్థాలు అయితే నీటలో కలవవో, చాలాసేపు కలియతిప్పిన తర్వాత కూడా నీటిలో కనిపించకుండా పోదో ఆ పదార్ధాన్ని ఏమంటారు?
a. నీటిలో కరిగే పదార్ధాలు
b. నీటిలో కరగని పదార్ధాలు
c. మిశ్రమాలు
d. పైవేవికావు
సరైన సమాధానం : నీటిలో కరగని పదార్ధాలు
6) "ఎన్ పాసెంట్" అనే పదము ఏ ఆటకు సంబంధించినది?
a. బాక్సింగ్
b. చదరంగం
c. ఫుట్ బాల్
d. క్రికెట్
సరైన సమాధానం : చదరంగం
7) భారతదేశం లోని ఏ రాష్ట్రంలో ఒకే ఒక పార్లమెంట్ సీటు ఉంది?
a. సిక్కిం
b. నాగాలాండ్
c. మిజోరం
d. పై అన్ని రాష్ట్రాలు
సరైన సమాధానం : పై అన్ని రాష్ట్రాలు
8) భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది?
a. భువనేశ్వర్ దురంతో
b. చెన్నై రాజధాని
c. వివేక్ ఎక్స్ ప్రెస్
d. సికింద్రాబాద్ దురంతో
సరైన సమాధానం : వివేక్ ఎక్స్ ప్రెస్
9) వైశాల్యం పరంగా భారతదేశంలోని అతిపెద్ద జాతీయ పార్క్ ఏది?
a. నందా దేవీ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్
b. నంధాఫా నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్
c. నియోర లోయ నేషనల్ పార్క్, వెస్ట్ బెంగాల్
d. నోక్రెక్ నేషనల్ పార్క్, మేఘాలయ
సరైన సమాధానం : నంధాఫా నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్
10) అరేబియా సముద్రంలో వున్న భారతదేశ ద్వీపాలను ఏమని పిలుస్తారు?
a. అండమాన్ మరియు నికోబార్ దీవులు
b. లక్షద్వీప్ దీవులు
c. మాల్దీవులు
d. పైవేవికావు
సరైన సమాధానం : లక్షద్వీప్ దీవులు
11) ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ సంవత్సరం "నీటి సహకారం" గా పాటించబడే సంవత్సరం ఏది?
a. 2010
b. 2011
c. 2012
d. 2013
సరైన సమాధానం : 2013
12) సెంట్రల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏ ప్రదేశంలో వుంది.?
a. గాంధీనగర్, అహ్మదాబాద్
b. లక్నో
c. న్యూఢిల్లీ
d. డెహ్రాడూన్
సరైన సమాధానం : న్యూఢిల్లీ
13) పిండిపదార్ధాలు, మాంసకృత్తులు తక్కువగా గల ఆహారం సుదీర్ఘ కాలం తీసుకోబడితే మానవులకు ఏమి జరుగుతుంది?
a. చాలా లావుగా అవుతారు
b. ఎదుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు
c. గ్రుడ్డివారు కావచ్చు
d. ఆటలు అద్భుతంగా ఆడవచ్చు
సరైన సమాధానం : ఎదుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు
14) పత్తి విత్తనాలు చిక్కుతీయడం ద్వారా వేరుచేస్తారు. ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు?
a. స్పిన్నింగ్
b. యార్న్
c. కాటన్ బాల్
d. గిన్నింగ్
సరైన సమాధానం : గిన్నింగ్
15) పదార్థాల ద్వారా చూడగలము కాని, స్పష్టముగా చూడలేకపోతే ఆ పదార్థాలను ఏమంటాము?
a. పారదర్శకం
b. నీడ
c. పార్శ్వ పారదర్శకం
d. అపారదర్శకం
సరైన సమాధానం : పార్శ్వ పారదర్శకం
16) గూగుల్ స్థాపకులలో ఒకరు
a. క్రిస్ హ్యూగ్స్
b. లారీ పేజ్
c. లియోనార్డ్ క్లెయిన్రాక్
d. చార్లెస్ రేన్లెట్ ఫ్లింట్
సరైన సమాధానం : లారీ పేజ్
17) ఒక గాజు గ్లాస్ లోని నీటిని ఉపయోగించి మీరు గుడ్డు తాజా అని ఎలా తెలుసుకుంటారు?
a. స్వచ్ఛమైన చల్లని తాగునీరుపై గుడ్డు తేలుతే
b. స్వచ్ఛమైన చల్లని తాగునీటిలో అడుగున వుండిపోతే
c. దాని రంగు ఎరుపుగా మారితే
d. పైవేవి కావు
సరైన సమాధానం : స్వచ్ఛమైన చల్లని తాగునీటిలో అడుగున వుండిపోతే
18) జ్ఞానపీఠ్ అవార్డు గెలిచిన రావూరి భరద్వాజ గారి పుస్తకం
a. ముసురు
b. పాకుడు రాళ్ళు
c. జీవన సమరం
d. కాదంబరి
సరైన సమాధానం : పాకుడు రాళ్ళు
19) ఈ క్రింది వాటిలో ఏది అస్థిపంజర వ్యవస్థ యొక్క విధి?
a. అస్థిపంజరం శరీరం కోసం చట్రాన్ని ఇస్తుంది
b. అస్థిపంజరం శరీరంలో అవయవాలను రక్షిస్తుంది
c. ఎముకలు వేర్వేరు దిశల్లో మరియు వివిధ మార్గాల్లో శారీరక కదలికకు సహాయం చేస్తాయి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
20) మనము ప్రజలను సమానంగా లేదా గౌరవంగా చూడకపోతే, దానిని ఏమంటారు?
a. ఉల్లంఘన
b. వేదింపు
c. వివక్ష
d. చట్టవిరుద్దమైన
సరైన సమాధానం : వివక్ష
21) తేనెటీగలు సేకరించే పువ్వులలోని తీపి రసాన్ని ఏమంటారు
a. మొలకెత్తిన గింజలు
b. మకరందము
c. సుగంధ ద్రవ్యము
d. పైవేవికావు
సరైన సమాధానం : మకరందము
22) పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలను ఏమంటారు?
a. తీపి పదార్థాలు
b. ఘనపదార్థాలు
c. పోషకాలు
d. మిశ్రమపదార్థాలు
సరైన సమాధానం : పోషకాలు
23) సరిఅయిన వాక్యాన్ని ఎంచుకోండి
a. బియ్యం ఒక్కటే తినడం ద్వారా, మనము శరీరానికి అవసరమైన పోషకాలను అందించలేము
b. నూన్యతా వ్యాధులను నివారించడానికి సమతుల్య ఆహారం తినాలి
c. శరీరానికి కావలసిన సమతుల్య ఆహారంలో రకరకాల ఆహార పదార్థాలు కలిగి ఉండాలి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
24) Find the past tense for "broadcast".
a. broadcosted
b. broadcosts
c. broadcast
d. broadcasting
సరైన సమాధానం : broadcast
25) The opposite word for "attack" is
a. defend
b. Charge
c. abuse
d. encounter
సరైన సమాధానం : defend
26) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అతి పొట్టి మనిషి (54.6 సెం.మీ)
a. జున్రే బాలవింగ్
b. ఇస్త్వన్ తొత్
c. చంద్ర బహదూర్ దాంగి
d. ఖాజేంద్ర తాప మగర్
సరైన సమాధానం : చంద్ర బహదూర్ దాంగి
27) Which of the following is synonym for the word "minlgle"?
a. Separate
b. blend
c. stay alone
d. None of the above
సరైన సమాధానం : blend
28) ఆటలకు సంబంధము లేనిది ఏది?
a. డ్రాప్
b. క్రీజ్
c. అడాప్షన్
d. అండర్ కట్టింగ్
సరైన సమాధానం : అడాప్షన్
29) 212 ఫారెన్హీట్ డిగ్రీల కు సమానమైన సెల్సియస్ కొలమానము డిగ్రీల కనుగొనండి.
a. 70
b. 110
c. 90
d. 100
సరైన సమాధానం : 100
30) వారంలో ఒక రోజు ఒక నిర్దిష్ట ప్రదేశంలో కనిపించే బజారు మరియు తరచుగా అమ్మబడే గృహ సంబంధ అవసరాలు, కూరగాయలు నుండి బట్టలు వరకు అవసరం అయ్యే ప్రతిదీ అమ్మే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు?
a. మాల్
b. గొలుసు బజారులు
c. సంత
d. పైవేవి కావు
సరైన సమాధానం : సంత
31) ఈ కింది ఆంగ్ల అక్షరాలలో అనేక సౌష్టవాక్షాలు కలిగినదేది?
a. G
b. J
c. O
d. Q
సరైన సమాధానం : O
32) ఈ కిందివాటిలో ఏది మంచి అలవాటు?
a. మంచి పుస్తక పఠనం
b. చేయవలసిన పనుల జాబితాను నిర్వహిస్తూ ఆ పనులను చేయడం
c. పెద్దలను గౌరవించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) My friend purchased 2 dozen banana. Now he doesn't know _________ to store them. Fill in the blank with the following suitable word.
a. Where
b. When
c. What
d. Why
సరైన సమాధానం : Where
34) ఈ కింది వాటినుండి వైవిధ్యమైన వస్తువును కనుగొనండి.
a. పుస్తకాలు
b. కుర్చి
c. వార్తాపత్రిక
d. పటాలు వేసుకొనే కాగితం
సరైన సమాధానం : కుర్చి
35) 19.45 గంటలను 12 గంటల సమయానికి మార్చండి
a. సాయంత్రం 9.45 గంటలు
b. సాయంత్రం 7.45 గంటలు
c. సాయంత్రం 8.45 గంటలు
d. సాయంత్రం 6.45 గంటలు
సరైన సమాధానం : సాయంత్రం 7.45 గంటలు
36) కార్బన్ కు సంబంధించి ఈ కిందివాటిలో ఏది సరిఅయినది కాదు?
a. కార్బన్ మూలకపు రసాయన సంకేతం C మరియు పరమాణు సంఖ్య 6.
b. కార్బన్ యొక్క మూడు బాగా తెలిసిన రూపాంతరాలు నిరాకార కార్బన్ (బొగ్గు, మసి లాంటివి), వజ్రాలు మరియు గ్రాఫైట్
c. ప్లాస్టిక్ లు కార్బన్ పాలిమర్లు నుండి తయారు అవుతాయి
d. ఇది సాపేక్షముగా అతి ప్రతిస్పందనాత్మక మూలకము
సరైన సమాధానం : ఇది సాపేక్షముగా అతి ప్రతిస్పందనాత్మక మూలకము
37) మే 2013 లో నిర్వహించే యు ఎస్ చదరంగం చాంపియన్ షిప్ జరిగే ప్రదేశము
a. న్యూయార్క్
b. వాషింగ్టన్ డి సి
c. సెయింట్ లూయిస్
d. కెనడా
సరైన సమాధానం : సెయింట్ లూయిస్
38) ఒక ఘనపుటడుగు ఎన్ని లీటర్లకు సమానము?
a. 18.5 లీటర్లు
b. 28.3 లీటర్లు
c. 38.7 లీటర్లు
d. 21.6 లీటర్లు
సరైన సమాధానం : 28.3 లీటర్లు
39) ఒక అతిపెద్ద సమూహంలో మహాత్మా గాంధీ లాగా వేషము ధరించిన పిల్లల సంఖ్య (ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా)
a. 225
b. 485
c. 795
d. 955
సరైన సమాధానం : 485
40) సి పి యు వున్న కంప్యూటర్ లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ యొక్క పేరు ఏమిటి?
a. ప్లాస్టిక్ బోర్డ్
b. మదర్ బోర్డు
c. గ్లాస్ బోర్డు
d. నేమ్ బోర్డు
సరైన సమాధానం : మదర్ బోర్డు
41) ఒక ఉద్యోగి సరుకుల కొరకు 20% , పిల్లల విద్యకై 25%, 18% తల్లిదండ్రులు ఆరోగ్యంపై, ఇంటి అప్పుకు 28% ఖర్చుచేసి మిగిలినది పొదుపు చేస్తాడు. తన జీతం రూ.28900 లు అయితే పొదుపు చేసినది ఎంత?
a. రూ.2411
b. రూ.2591
c. రూ.2601
d. రూ.2755
సరైన సమాధానం : రూ.2601
42) ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంత నగదు బహుమతి ఇవ్వబడుతుంది?
a. రూ.2 లక్షలు
b. రూ. 3.5 లక్షలు
c. రూ. 5 లక్షలు
d. రూ. 7.5 లక్షలు
సరైన సమాధానం : రూ. 5 లక్షలు
43) "Syllabus" నకు బహువచనమును కనుగొనండి
a. Syllabuses
b. Syllabus
c. Syllabi
d. Syllabis
సరైన సమాధానం : Syllabi
44) 8a+(4a-1)= 8 ని సత్యవాక్యము చేయడానికి కావలసిన విలువ
a. 0.25
b. 0.5
c. 0.75
d. 1.25
సరైన సమాధానం : 0.75
45) పార్శ్వ విలోమ కాంతిని చూపే అద్దం ఏది?
a. సమతల దర్పణం
b. పుటాకార దర్పణం
c. తళుకు దర్పణం
d. కుంభాకార దర్పణం
సరైన సమాధానం : సమతల దర్పణం
46) ఈ కిందివాటిలో ఏది సత్యము?
a. భారతదేశం ప్రపంచలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం
b. భారతదేశం నుండి భారత ద్రవ్యాన్ని (రూపాయలు) బయటకు తీసుకువెళ్ళడం చట్టవిరుద్దం
c. భారతదేశంలో ప్రపంచంలోని అన్ని పెద్ద మతాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. అదనంగా, హిందూమతం, బౌద్ధమతం, జైనమతం, మరియు సిక్కిజం అన్ని భారతదేశంలో ఉద్భవించాయి.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
47) ఈ కిందివాటిలో ఏది ఆకుపచ్చ కూర?
a. పచ్చిబటానీలు
b. కీరదోసకాయ
c. బచ్చలికూర
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
48) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎవరు?
a. ఐ వై ఆర్ కృష్ణారావు, ఐ ఎ ఎస్.,
b. డా. ఐ వి సుబ్బారావు, ఐ ఎ ఎస్.,
c. డా. ప్రసన్న కుమార్ మోహంతి, ఐ ఎ ఎస్.,
d. డా. ఎస్. చెల్లప్ప, ఐ ఎ ఎస్.,
సరైన సమాధానం : డా. ప్రసన్న కుమార్ మోహంతి, ఐ ఎ ఎస్.,
49) మాన్ గ్రూవ్ అడవులు ఎక్కడ వర్థిల్లుతాయి?
a. కలుషిత నీరు
b. మంచి నీరు
c. ఉప్పునీరు
d. పైవేవి కావు
సరైన సమాధానం : ఉప్పునీరు
50) ఈ క్రింది వాటిలో ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉన్నదేది?
a. ప్లాపి
b. సి డి
c. డి వి డి
d. 2 జిబి పెన్ డ్రైవ్
సరైన సమాధానం : డి వి డి
సమాధానాలు
1)c2)a3)d4)b5)b6)b7)d8)c9)b10)b11)d12)c13)b14)d15)c16)b17)b18)b19)d20)c21)b22)c23)d24)c25)a
26)c27)b28)c29)d30)c31)c32)d33)a34)b35)b36)d37)c38)b39)b40)b41)c42)c43)c44)c45)a46)d47)d48)c49)c50)c