online Quiz
print this article

తరగతి 3 నుండి 5 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, సెప్టెంబర్-2013

1) రూ. 860 చెల్లించడానికి ఎన్ని 20 రూపాయల నోట్లు అవసరమౌతాయి?
a. 163
b. 188
c. 193
d. 198
సరైన సమాధానం : 193
2) 90 డిగ్రీలు కోణంగా కలిగిన త్రిభుజాన్ని ఏమని పిలుస్తాము?
a. అల్పకోణ త్రిభుజము
b. లంబకోణ త్రిభుజము
c. అధికకోణ త్రిభుజము
d. పైవేవి కావు
సరైన సమాధానం : లంబకోణ త్రిభుజము
3) విషపూరిత పాము కరిచినప్పుడు వెంటనే ఏమి చేయాలి?
a. భయాందోళనకు గురికాకుండా శాంతముగా వుండాలి
b. కాటు పడినచోటుకు 2 నుండి 4 అంగుళాలపైన ఒక బ్యాండేజి కట్టాలి
c. అత్యవసర సహాయముకోరకు 108 సేవను పిలవాలి
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
4) నీటి కాలుస్యానికి ఈ కింది వానిలో ఏది కారణము?
a. మురుగు మరియు ఘన వ్యర్థాలను మంచినీటిలో కలపడం
b. వ్యవసాయ క్షేత్రాలనుండి విడుదలయిన (పురుగుమందులు మరియు రసాయనాలు) వ్యర్థాలు నీటిలో కలవడం
c. శుద్దిచేయబడిన పారిశ్రామిక వ్యర్థలు నీటిలో కలవడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
5) నిరంతరాయంగా 25 గంటలు త్రెడ్మిల్ పైన పరిగెత్తి లిమ్కా రికార్డు సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
a. పి టి ఉష
b. మిషెల్లి కాకడె
c. టింటు లుకా
d. ఎమ్ ఆర్ పూవమ్మ
సరైన సమాధానం : మిషెల్లి కాకడె
6) "EQ" అనేది
a. Education Quotient
b. Emotional Quotient
c. Examination Quotient
d. Employee Quotient
సరైన సమాధానం : Emotional Quotient
7) మానవ శరీరంలో పక్కటెముకలు ఎలా పనిచేస్తాయంటే
a. స్థంభము వలె
b. పంజరము వలె
c. పైకప్పు వలె
d. నేల వలె
సరైన సమాధానం : పంజరము వలె
8) ఈ క్రింది వాటిలో ఏది చెడు ప్రవర్తనగా కనపడుతుంది?
a. ప్రజల మధ్యలో ఉమ్మివేయడం & అవసరంలేనప్పుడు అసభ్యకరమైన భాషను తరచుగా ఉపయోగించడం
b. తినేప్పుడు గట్టిగా మాట్లాడటం & ప్రజలు, జంతువులు, వస్తువులు మొదలైనవాటిని తన్నడం
c. తుమ్మేటప్పుడు ముక్కు మూసుకోకపోవడం & ముక్కులో వేలు పెట్టడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
9) ఈ కిందివానిలో ఏది నీటిపై తేలుతుంది.?
a. ప్లాస్టిక్ బంతి
b. ఇనుప బంతి
c. గాజు బంతి
d. పైవన్ని
సరైన సమాధానం : ప్లాస్టిక్ బంతి
10) "దురంతొ" అనే పదం దేనికి సంబంధించినది
a. రోడ్డు రవాణా
b. విమానయానం
c. రైల్వేలు
d. జల రవాణా
సరైన సమాధానం : రైల్వేలు
11) " సత్యం, శివం, సుందరం" అనేది దేని నినాదము
a. ఆకాశవాణి
b. భారత సైన్యం
c. దూరవాణి
d. భారతీయ రైల్వేలు
సరైన సమాధానం : దూరవాణి
12) ఈ కిందివానిలో సరిపోనిదానిని ఎంచండి
a. ఐస్ క్రీం
b. గులాబ్ జామూన్
c. సమోసా
d. ఛాం – ఛాం
సరైన సమాధానం : సమోసా
13) ఈ కిందివాటిలో కంప్యూటర్ భాగము కానిది ఏది?
a. హెచ్ డి డి
b. మదర్ బోర్డ్
c. ఎస్ ఎమ్ పి ఎస్
d. ప్రింటర్
సరైన సమాధానం : ప్రింటర్
14) 28, 46, 59 మరియు -37 ల మొత్తమెంత?
a. 86
b. 90
c. 96
d. 99
సరైన సమాధానం : 96
15) సరిఅయిన అర్థం వచ్చేలా "miexntainao" పదాన్ని సరిచేసి రాయండి.
a. extainaonim
b. taminoaexin
c. examination
d. mintaaoxenn
సరైన సమాధానం : examination
16) ఈ కిందివానిలో భారతదేశానికి సంబంధించినది ఏది?
a. ఫోంగ్ నాహ్ గుహ
b. అజంతా & ఎల్లోరా గుహలు
c. స్కోజాన్ గుహలు
d. ద క్రిష్టల్ గుహలు
సరైన సమాధానం : అజంతా & ఎల్లోరా గుహలు
17) 1, 4,9,16, 25, _____. ఈ శ్రేణిలోని తదుపరి సంఖ్యను కనుగొనండి
a. 32
b. 36
c. 40
d. 44
సరైన సమాధానం : 36
18) జూలై 2013 నాటికి ఏది ఖరీదైనది?
a. ఒక లీటర్ పెట్రోల్
b. ఒక లీటర్ డీజిల్
c. ఒక లీటర్ పాలు
d. ఒక కి.గ్రా సి ఎన్ జి
సరైన సమాధానం : ఒక లీటర్ పెట్రోల్
19) మానవులు ఏ రకానికి చెందినవారు?
a. మీనములు
b. ఉభయచరాలు
c. సరీసృపాలు
d. క్షీరదాలు
సరైన సమాధానం : క్షీరదాలు
20) రాజు 3 బిస్కట్ ప్యాకెట్లను తెచ్చాడు. ప్రతి ప్యాకెట్ లో 11 బిస్కెట్లు ఉన్నాయి. స్నేహితులు 9 మంది 3 బిస్కెట్ల చొప్పున తీసుకున్నారు. రాజు వద్ద ఎన్ని బిస్కెట్లు మిగిలాయి?
a. 2
b. 4
c. 6
d. 8
సరైన సమాధానం : 6
21) నేను పసుపు పచ్చగా కనపడతాను. గాయాలపైన రాసినట్లయితే నేను వాటిని త్వరగా తగ్గిస్తాను మరియు అందరికి కావలసిన దానిని – అయితే నేను ఎవరు?
a. మిరప పొడి
b. మామిడి పొడి
c. పసుపు పొడి
d. పైవన్ని
సరైన సమాధానం : పసుపు పొడి
22) రఘు 2 నోటు పుస్తకాలను 34 రూపాయలకు, ఒక స్కేల్ ను 15 రూపాయలకు మరియు ఒక బాల్ పెన్నును 8 రూపాయలకు కొన్నాడు. రఘు దుకాణుదారుకు 100 రూపాయల నోటు ఇచ్చినట్లయితే, అతనికి తిరిగి ఎంత సొమ్ము వస్తుంది?
a. 9
b. 40
c. 43
d. 51
సరైన సమాధానం : 43
23) భారతదేశ పటములో జమ్ము & కాశ్మీర్ ఎక్కడ కనిపిస్తుంది?
a. కింది భాగాన
b. పై భాగాన
c. కుడివైపున
d. ఎడవవైపున
సరైన సమాధానం : పై భాగాన
24) ఈ కిందివానిలో ఏది ఏడు రంగులను పరావర్తనం చెందిస్తుంది?
a. దర్పణము
b. సాదా గాజు
c. పట్టకము
d. పైవన్ని
సరైన సమాధానం : పట్టకము
25) బట్టలు నేయడం జరిగేది ఇక్కడే
a. రెడిమేడ్ దుకాణము
b. సాలె మగ్గము
c. బట్టలు అమ్మే దుకాణము
d. పైవేవి కావు
సరైన సమాధానం : సాలె మగ్గము
26) గాజు పాత్రలు మరియు సీసాలను ఊరగాయలతో వాటిని నింపే ముందు సూర్యరశ్మిలో వుంచి తేమలేకుండా చూస్తారు. ఎందుకు ఇలా చేస్తారు?
a. లోపలి పదార్థము బాగా కనపడడానికి
b. తేమవల్ల పదార్థాలకు బూజు పట్టి చెడిపోకుండా ఉండడానికి
c. పదార్థాలు సూర్యశక్తిని పొందడానికి
d. పైవేవి కావు
సరైన సమాధానం : తేమవల్ల పదార్థాలకు బూజు పట్టి చెడిపోకుండా ఉండడానికి
27) " ఆరెంజ్ సిటీ" అనేది అమెరికాలోని ఫ్లోరిడాలోవుంది, కాని " ఆరెంజ్ సిటీ" అనే ముద్దుపేరుగల ఒక నగరం భారతదేశంలో వుంది. ఈ కిందివాటిలో నుండి దానిని కనుగొనండి.
a. జైసల్మార్
b. పూనె
c. నాగపూర్
d. శ్రీనగర్
సరైన సమాధానం : నాగపూర్
28) ఆర్ టి ఇ 2009 ప్రకారం ఈ కింది వానిలో ఏది సరిఅయినది?
a. ఇది నమోదుకాని బిడ్డను వయస్సుకు తగిన తరగతిలో చేర్చడానికి ఏర్పాటును కలిగిస్తుంది.
b. ఇది ఇతర విషయాలతో పాటు విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తులను (PTRs), భవనాలు మరియు మౌళిక సౌకర్యాలు,పాఠశాల పనిదినాలు, ఉపాధ్యాయ-పనిగంటలు సంబంధించిన నిబంధనలను మరియు ప్రమాణాలను నిర్థారిస్తుంది.
c. (a) ఇది భౌతిక శిక్షలు, మానసిక వేదనలు, (b) పిల్లల నమోదుకొరకు నిర్వహించే యోగ్యతా పరీక్షలు (c) తలసరి రుసుం (d)ఉపాధ్యాయుల ప్రైవేటు ట్యూషన్ మరియు (e)గుర్తింపు లేకుండా పనిచేస్తున్న పాఠశాలలపై నిషేదాన్
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
29) "కార్భన్ డై ఆక్సైడ్" సాంకేతికమును కనుగొనండి
a. C2
b. Ca2
c. Co2
d. C2o
సరైన సమాధానం : Co2
30) 108, 0 మరియు 10 ల లబ్దము కనుగొనండి.
a. 1080
b. 10800
c. 1008
d. 0
సరైన సమాధానం : 0
31) వేటాడే మొక్కను కనుగొనండి.
a. వైల్డ్ రోజ్
b. పిచ్చర్ ప్లాంట్
c. ఆరెంజ్ స్వాలో- వొర్ట్
d. హైబిస్కస్
సరైన సమాధానం : పిచ్చర్ ప్లాంట్
32) దోమలు మీ ఇంటిలో, పాఠశాలలో మరియు చుట్టుపక్కల అవి ఉత్పత్తి కాకుండా వుండడానికి నీవు ఏం చేస్తావు? సరిఅయిన సమాధానాన్ని ఎంచుకోండి.
a. నేను ఇంటిలో, పాఠశాలలో మరియు చుట్టుపక్కల నీరు నిలువకుండా చూస్తాను.
b. నేను నీటి కుండలు, కూలర్లు మరియు తొట్టెలను శుభ్రంగా ఉంచుతాను. వారానికి ఒకసారి వాటిని పొడిగా వుంచుతాను.
c. నీటి గుంటలలో చేపలను వేస్తాను, ఎందుకంటే అవి దోమ లార్వాలను తినివేస్తాయి.
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) 0.9 సెం.మీ అంటే అర్థమేమిటి?
a. 9 సెం.మీ
b. 9 మి..మీ
c. 9 డె.మీ
d. పైవేవి కావు
సరైన సమాధానం : 9 మి..మీ
34) సుధకి రోజు 37 పంక్తులు రాసే అలవాటు వుంది. 2 వారాల తర్వాత ఆమె ఎన్ని పంక్తులు పూర్తిచేసివుంటుంది?
a. 74 పంక్తులు
b. 214 పంక్తులు
c. 518 పంక్తులు
d. 555 పంక్తులు
సరైన సమాధానం : 518 పంక్తులు
35) నీవు ఆధార్ కార్డ్ ను కలిగి వుండాలి. నీకు ఆధార్ ప్రఖ్యాత సంఖ్యలో ఎన్ని అంకెలువుంటాయో తెలుసా?
a. 8
b. 10
c. 12
d. 14
సరైన సమాధానం : 12
36) ఈ కిందివానిలో ఏది పెద్ద సంఖ్య ?
a. 31.05
b. 31.5
c. 31.15
d. 31.155
సరైన సమాధానం : 31.5
37) రూ.800 లలో 5 % న్ని కనుగొనండి?
a. రూ. 20
b. రూ. 30
c. రూ. 40
d. రూ. 50
సరైన సమాధానం : రూ. 40
38) చైనా రాజధాని
a. ఢాఖా
b. బెజింగ్
c. కాబూల్
d. కరాఛి
సరైన సమాధానం : బెజింగ్
39) ఈ కిందివానిలో ఏది ఎక్కువ సామర్థ్యం కలది?
a. 10 TB
b. 10 GB
c. 10 MB
d. 100 KB
సరైన సమాధానం : 10 TB
40) "చదువుల వెలుగులు" తెలుగు పుస్తకం ప్రచురణ కర్త ఎవరు?
a. ఎమెస్కో బుక్స్
b. నవసాహితి బుక్ హౌస్
c. మంచి పుస్తకం
d. సాహితి ప్రచురణలు
సరైన సమాధానం : మంచి పుస్తకం
41) 102 X 101 లబ్ధము ఎంత?
a. 10
b. 100
c. 1000
d. 10000
సరైన సమాధానం : 1000
42) ఈ కిందివానిలో ఏది జ్ఞాపకశక్తి అభివృద్దికి మంచిది
a. 20 కన్నా ఎక్కువ పుస్తకాలున్న ఒక పెద్ద సంచి
b. శ్వాససంబంధ వ్యాయామాలు, యోగాసనాలు, ధ్యానము మరియు వ్రాసే అలవాటు
c. చాయ్, కాఫి మరియు పానీయాలు అతిగా సేవించడం
d. ఎక్కువ సమయం టివి చూడడం మరిము ఇంటిపని చేయకపోవడం
సరైన సమాధానం : శ్వాససంబంధ వ్యాయామాలు, యోగాసనాలు, ధ్యానము మరియు వ్రాసే అలవాటు
43) ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ వచ్చేది
a. జ్యేష్ట పూర్ణిమ
b. ఆషాడ పూర్ణిమ
c. శ్రావణ పూర్ణిమ
d. భాద్రపద పూర్ణిమ
సరైన సమాధానం : ఆషాడ పూర్ణిమ
44) ఈ కిందివానిలో ఏది 2012 ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ సినిమా అవార్డ్ పొందింది?
a. చిల్లార్ పార్టి
b. కేషు
c. దేఖ్ ఇండియన్ సర్కస్
d. పుట్టాణి పార్టి
సరైన సమాధానం : దేఖ్ ఇండియన్ సర్కస్
45) నేత్రాధ్యయనాన్ని ఇలా పిలుస్తాము.
a. ఆప్తమాలజీ
b. ఓస్టియోలజీ
c. డెర్మటాలజీ
d. సైకాలజీ
సరైన సమాధానం : ఆప్తమాలజీ
46) భారతీయ జెండాను రూపొందించినది ఎవరు?
a. ఎ వి రాజేశ్వరరావు
b. పింగళి వెంకయ్య
c. ఎ ఉమాకాంతమ్
d. బి అచ్చమాంబ
సరైన సమాధానం : పింగళి వెంకయ్య
47) భారతీయ పతాకములోని అశోకచక్రమునందు గల 24 చువ్వలు సూచిందేది
a. 24 కథలు
b. 24 అంశాలు
c. 24 గుణములు
d. 24 స్థూపాలు
సరైన సమాధానం : 24 గుణములు
48) ఒక అంగ వైకల్యము కలిగిన బిడ్డ తన తరగతి గదిలోనికి దీని సహాయముతో వెళ్తాడు.?
a. మెట్లు
b. వాలుతలము
c. లిప్ట్
d. పైవేవి కావు
సరైన సమాధానం : వాలుతలము
49) బృందాన్ని ముందుండి నడిపించే వారిని ఇలా పిలుస్తాము.
a. కోచ్
b. మాష్టర్
c. గైడ్
d. కేప్టన్
సరైన సమాధానం : కేప్టన్
50) "elementary" కి వ్యతిరేక పదాన్ని ఎంచుకోండి.
a. Secondary
b. Primary
c. advanced
d. Higher
సరైన సమాధానం : advanced
సమాధానాలు
1)c2)b3)d4)d5)b6)b7)b8)d9)a10)c11)c12)c13)d14)c15)c16)b17)b18)a19)d20)c21)c22)c23)b24)c25)b
26)b27)c28)d29)c30)d31)b32)d33)b34)c35)c36)b37)c38)b39)a40)c41)c42)b43)b44)c45)a46)b47)c48)b49)d50)c