online Quiz
print this article

తరగతి 6 నుండి 8 వరకు ప్రశ్నలు మరియు సమాధానములు, సెప్టెంబర్-2013

1) "The true basis of education is the study of human mind -- infant, adolescent and adult." ఈ పదాలను ఉటంకించినది ఎవరు?
a. సుభాష్ చంద్రబోస్
b. జవహార్ లాల్ నెహ్రూ
c. శ్రీ అరబిందో
d. స్వామి వివేకానంద
సరైన సమాధానం : శ్రీ అరబిందో
2) ఈ కిందివానిలో భారతదేశంలో వున్న ఎత్తైన రైల్వే స్టేషన్ ఏది?
a. సిమ్లా
b. ఊటీ
c. గుమ్
d. సోలాన్
సరైన సమాధానం : గుమ్
3) ఒక పదార్థాన్ని సూక్ష్మదర్శిని కింద వుంచినప్పుడు ఇలా కనపడుతుంది.
a. చిన్నదిగా
b. పెద్దదిగా చేయబడింది
c. వున్నది ఉన్నట్లుగానే
d. అనేకముగా
సరైన సమాధానం : పెద్దదిగా చేయబడింది
4) ఈ కిందివానిలో చర్మవ్యాధి కానిది ఏది?
a. పెల్లగ్రా
b. సోరియాసిస్
c. పింక్ ఐ
d. స్కేబీస్
సరైన సమాధానం : పింక్ ఐ
5) "My Journey" అనే పేరున్న పుస్తకం వీరిచే రాయబడింది
a. ఎమ్. కె. గాంధీ
b. కిరణ్ దేశాయ్
c. డా. ఎ. పి జె. అబ్దుల్ కలాం
d. లాల్ కృష్ణ అధ్వాని
సరైన సమాధానం : డా. ఎ. పి జె. అబ్దుల్ కలాం
6) ఈ కిందివానిలో ఏది సరిఅయినది కాదు?
a. ట్రోపో ఆవరణం సాంద్రత కలిగిన భాగం మరియు దాని ఎత్తు భూమి నుండి 8-18 కి.మీ. మధ్య ఉంటుంది.
b. విమానాలు స్ట్రాటోస్పియర్ లో ఎగురుతాయి.
c. ఆక్సిజన్ లేకుండా జీవించడం సాధ్యం మరియు ఆనందకరం
d. అయనోస్పియర్ రేడియో తరంగాలను పరావర్తనం చెందించి తిరిగి భూతలానికి పంపుతుంది.
సరైన సమాధానం : ఆక్సిజన్ లేకుండా జీవించడం సాధ్యం మరియు ఆనందకరం
7) "Lady" కి బహువచనాన్ని కనుగొనండి
a. Ladys
b. Ladis
c. Ladies
d. Ladyis
సరైన సమాధానం : Ladies
8) ఈ కిందివానిలో ఏది వాయుస్థితిలో సమ్మేళనముగా వుంటుంది?
a. సోడియం క్లోరైడ్
b. నీరు
c. కార్భన్ డై ఆక్సైడ్
d. హైడ్రోజన్
సరైన సమాధానం : కార్భన్ డై ఆక్సైడ్
9) " The mind is every thing. What you think you become." Identify the part of speech of bold and underlined word.
a. Adjective
b. Verb
c. Preposition
d. adverb
సరైన సమాధానం : Verb
10) ప్రపంచంలో లోతైన ఇరుకుగా వున్న లోయ ఏది?
a. ది గ్రాండ్ కేన్యన్, అమెరికా
b. బారంకా డెల్ కోబ్రి, మెక్సికో
c. యార్లాంగ్ ఝాంబో గ్రాండ్ కేన్యన్, చైనా
d. కాలి గంథకి, నేపాల్
సరైన సమాధానం : కాలి గంథకి, నేపాల్
11) ప్రపంచ అంతర్జాతీయ స్వదేశి వాసుల దినాన్ని ఏ రోజు గమనించవచ్చు
a. జూలై 9
b. ఆగష్టు 9
c. సెప్టెంబర్ 9
d. అక్టోబర్ 9
సరైన సమాధానం : ఆగష్టు 9
12) ఈ కిందివానిలో తప్పుడు వాక్యాన్ని ఎంచండి.
a. పిండిపదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి.
b. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, అభివృద్ధికి సహాయపడతాయి.
c. ఖనిజాలు మన పళ్ళను, ఎముకలను గట్టిగా తయారుచేస్తాయి
d. పీచుపదార్థాలు మలబద్దకానికి కారణము
సరైన సమాధానం : పీచుపదార్థాలు మలబద్దకానికి కారణము
13) ఒక చదరపు కిలోమీటరు దీనికి సమానము
a. 100 హెక్టార్లు
b. 1000000 చదరపు మీటర్లు
c. 0.3861 చదరపు మైళ్ళు
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
14) తేమ పతనాన్ని ఇలా అంటారు
a. గట్టిపడడం
b. అవక్షేపము
c. ఉక్కబోత
d. పైవేవి కావు
సరైన సమాధానం : అవక్షేపము
15) ఏ విలువ 5a-(2a+1)= 8 ని సత్యవాక్యముగా మారుస్తుంది.
a. 1
b. 2
c. 3
d. 4
సరైన సమాధానం : 3
16) ఆహారంలోని పిండి పదార్థముతో అయోడిన్ చర్యనొందినప్పుడు ఏ రంగు కన్పిస్తుంది?
a. నారింజ రంగు
b. గాఢమైన చిక్కని నీలిరంగు
c. లేత పసుపు రంగు
d. పాలవంటి తెలుపు రంగు
సరైన సమాధానం : గాఢమైన చిక్కని నీలిరంగు
17) ఈ కింది దేశాలలోని దేనికి భారతదేశము నుండి రహదారి లింక్ లేదు?
a. పాకిస్తాన్
b. శ్రీలంక
c. భూటాన్
d. నేపాల్
సరైన సమాధానం : శ్రీలంక
18) దంతములను ఆరోగ్యకరంగా వుంచడానికి ఏమి చేయకూడదు?
a. ఆహార పదార్థాలను తీయడానికి పిన్నులు, సూదులు ఉపయోగించడం
b. ఆహారం తిన్న తర్వాత నోటిని శుభ్రపరచపోవడం
c. త్రాగునీటి కోసం ప్లోరిన్ కలిగిన నీటిని ఉపయోగించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
19) Find the present tense for "Shot".
a. Shot
b. Shut
c. Shoot
d. None of the above
సరైన సమాధానం : Shoot
20) 8.7 X 102 ని సాధారణ రూపములో వ్రాయండి
a. 8.6999999999999993
b. 87
c. 870
d. 8700
సరైన సమాధానం : 870
21) భూతలము పైన వున్న అన్ని జల రూపాలను కలిపి ఈ పేరుతో తెల్సుకుంటాము.
a. స్ట్రాటోస్పియర్
b. హైడ్రోస్పియర్
c. ట్రోపోస్పియర్
d. సెమి స్పియర్
సరైన సమాధానం : హైడ్రోస్పియర్
22) వాహనాలలో వెనుక వున్నవాటిని చూడడానికి ఉపయోగించే దర్పణము ఏది?
a. పుటాకార దర్పణము
b. మెరుగు పెట్టిన దర్పణము
c. సమతల దర్పణము
d. కుంభాకార దర్పణము
సరైన సమాధానం : కుంభాకార దర్పణము
23) 17 మరియు 0.5 ల లబ్దము ఎంత?
a. 85
b. 42.5
c. 34
d. 8.5
సరైన సమాధానం : 8.5
24) "కుటుంబం ఏర్పాటు" యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి పాటించే సంవత్సరము
a. 2012
b. 2013
c. 2014
d. 2015
సరైన సమాధానం : 2014
25) 2013 లో పూనెలో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో మొదటి బంగారు పతకాన్ని భారతదేశము ఏ క్రీడలో సాధించింది?
a. బాక్సింగ్
b. రన్నింగ్
c. డిస్కస్ త్రో
d. లాంగ్ జంప్
సరైన సమాధానం : డిస్కస్ త్రో
26) Find the antonym for "bent"
a. Top
b. Curve
c. Straight
d. Pull
సరైన సమాధానం : Straight
27) ఈ కిందివానిలో చెడ్డ అలవాటు ఏది?
a. బొటన వేలు చప్పరించడం
b. గోళ్ళు కొరకడం
c. ముక్కులో వేలు పెట్టుకోవడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
28) నీప్ అలలు అనేవి
a. ఉదృతమైన అలలు
b. అత్యల్ప స్థాయి అలలు
c. సాధారణ అలలు
d. పైవేవి కావు
సరైన సమాధానం : అత్యల్ప స్థాయి అలలు
29) ఈ కింది వాక్యములలో ఏది సత్యము?
a. మన దేశము యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే భిన్నత్వములో ఏకత్వము
b. మన దేశాన్ని సమర్థించుకోవడం పౌరుని యొక్క విధి
c. రాజ్యాంగము మనకు సమానావకాశాలను కల్పిస్తోంది మరియు స్వేచ్ఛ, సమానత్వము, న్యాయాలను కాపాడుతోంది
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
30) ఈ కిందివానిలో సహజ సంఖ్యలకు లేని సంకలన ధర్మము ఏది?
a. స్థిత్యంతరన్యాయము.
b. విలోమ ఉనికి
c. సంయోగన్యాయము.
d. పునరుక్తి న్యాయము
సరైన సమాధానం : విలోమ ఉనికి
31) జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఇక్కడ వుంది.
a. హైదరాబాద్
b. ఫరీదాబాద్
c. అహ్మదాబాద్
d. అలహాబాద్
సరైన సమాధానం : హైదరాబాద్
32) ఈ కిందివానిలో ఏది అస్థిపంజర వ్యవస్థ యొక్క పని కాదు?
a. ఒక కణము నుండి ఇంకొక దానికి సంకేతాలను పంపడం
b. ఆహారాన్ని శక్తిగా మార్చడం
c. రక్తం నుండి వ్యర్థపదార్థాలను తొలగించడం మరియు ద్రవపదార్థాల స్థాయిలను నియంత్రించడం
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
33) స్టెఫ్కా కోస్టాడినోవా నెలకొల్పిన మహిళా హై జంప్ ప్రపంచ రికార్డ్ ఎంత?
a. 2.0 మీటర్లు
b. 2.09 మీటర్లు
c. 2.9 మీటర్లు
d. 2.99 మీటర్లు
సరైన సమాధానం : 2.09 మీటర్లు
34) ఈ కింది వాక్యములలో ఏది సరిఅయినది?
a. గాలిని వేడిచేయడం వలన బరువు పెరుగుతుంది
b. పదార్థాలు వేడిచేయడం వలన వ్యాకోచిస్తాయి.
c. నీడలు వస్తువు యొక్క సహజ రంగును కలిగివుంటాయి
d. విధ్యుత్తును తమ గుండా ప్రసరించనీయని పదార్థాలను "వాహకాలు" అంటారు
సరైన సమాధానం : పదార్థాలు వేడిచేయడం వలన వ్యాకోచిస్తాయి.
35) "MB" అనే కంప్యూటర్ అబ్రివేషన్ నకు సాధారణ అర్థం
a. Mini Bus
b. Mother Board
c. Mega Byte
d. Modem Board
సరైన సమాధానం : Mega Byte
36) ఈ కిందివానిలో వేరు దుంప ఏది?
a. క్యారెట్
b. వంకాయ
c. సోరకాయ
d. కాకరకాయ
సరైన సమాధానం : క్యారెట్
37) "కార్నర్ కిక్" అనే పదం ఏ ఆటకు సంబంధించినది?
a. బాక్సింగ్
b. కరాటె
c. ఫుట్ బాల్
d. వాలిబాల్
సరైన సమాధానం : ఫుట్ బాల్
38) పిండిపదార్థాలను ఎక్కువకాలం అధికంగా తీసుకోవడం వలన మానవులకు ఏం జరుగుతుంది?
a. దృష్టిని కోల్పోవడం
b. బరువు పెరగడం
c. బలహీన పడడం
d. బట్టతల
సరైన సమాధానం : బరువు పెరగడం
39) క్రమబద్ధమైన మరియు / లేదా నిరంతర అవాంఛిత మరియు బాధించే చర్యలు చేసే ఒక తెగ లేదా ఒక సమూహం ద్వారా బెదిరింపులు మరియు దబాయింపులతో సహా లాంటి వాటిని ఇలా అంటాము
a. బేధభావం
b. అతిక్రమణ
c. వేదింపు
d. అన్యాయము
సరైన సమాధానం : వేదింపు
40) Which of the following is synonym for the word "Bitter"?
a. Sweet
b. Joy
c. Sour
d. Heartfelt
సరైన సమాధానం : Sour
41) ఈ కిందివానిలో విభేధించే పదార్థాన్ని కనుగొనండి
a. టీ
b. కాఫీ
c. ఐస్ క్రీం
d. పాలు
సరైన సమాధానం : ఐస్ క్రీం
42) ఒక వ్యవసాయదారుడు తన ధాన్యాన్ని అమ్మడం ద్వారా 50% ఆదాయాన్ని, పాలు అమ్మడం ద్వారా 25% ఆదాయాన్ని మరియు బ్యాంక్ వడ్డీ ద్వారా మిగిలిన మొత్తాన్ని సంపాదించాడు. అతని మొత్తం ఆదాయం 9000 రూపాయలు అయితే అతనికి బ్యాంకు వడ్డీ ద్వారా వచ్చినది ఎంత?
a. 2000 రూపాయలు
b. 2250 రూపాయలు
c. 2500 రూపాయలు
d. 2750 రూపాయలు
సరైన సమాధానం : 2250 రూపాయలు
43) ఆంద్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క గౌరవనీయులైన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
a. పినాకి చంద్ర ఘోష్
b. కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా
c. మదన్ భీమరావు
d. నిసార్ అహ్మద్ కకృ
సరైన సమాధానం : కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా
44) భారతదేశంలో వున్న జిల్లాలు ఎన్ని?
a. 625
b. 640
c. 666
d. 681
సరైన సమాధానం : 640
45) పట్టు పురుగుల ఇష్టమైన ఆహరం
a. పాలకూర
b. చెరకు ఆకులు
c. మల్బరి ఆకులు
d. ఎండు గడ్డి
సరైన సమాధానం : మల్బరి ఆకులు
46) ఈ కిందివానిలో ఏది గాలిలోని హాని కలిగించే పదార్థము?
a. కార్బన్ మోనక్సైడ్
b. సల్ఫర్ డై ఆక్సైడ్స్
c. నైట్రొజన్ ఆక్సైడ్స్
d. పైవన్ని
సరైన సమాధానం : పైవన్ని
47) క్రికెట్ ఆటలో ఎంతమంది అంపైర్లు వుంటారు?
a. 2
b. 3
c. 4
d. 5
సరైన సమాధానం : 4
48) సాయంత్రం 9.25 ను రైల్వే సమయంగా మార్చండి.
a. 19.25 గంటలు
b. 17.25 గంటలు
c. 21.25 గంటలు
d. 23.25 గంటలు
సరైన సమాధానం : 21.25 గంటలు
49) ఐ ఐ ఎఫ్ ఎ 14వ బహుమతుల తో ఉత్తమ నటిగా బహుమతి పొందినది
a. ప్రియాంక చోప్రా
b. శ్రీదేవి
c. విధ్యాబాలన్
d. దీపికా పడుకోనే
సరైన సమాధానం : విధ్యాబాలన్
50) బి ఎస్ ఎన్ ఎల్ జూలై 15, 2013న నిలుపుదల చేసిన సేవ ఏది?
a. పోస్ట్ కార్డ్
b. స్పీడ్ పోస్ట్
c. టెలిగ్రామ్
d. సర్టిఫీకెట్ ఆఫ్ పోస్టింగ్
సరైన సమాధానం : టెలిగ్రామ్
సమాధానాలు
1)c2)c3)b4)c5)c6)c7)c8)c9)b10)d11)b12)d13)d14)b15)c16)b17)b18)d19)c20)c21)b22)d23)d24)c25)c
26)c27)d28)b29)d30)b31)a32)d33)b34)b35)c36)a37)c38)b39)c40)c41)c42)b43)b44)b45)c46)d47)c48)c49)c50)c